సిద్ధార్థ v/s శబరి.... బైరెడ్డి ఫ్యామిలీలో వారసత్వ పోరు !
కర్నూలు రాజకీయాల్లో ఇప్పుడో హాట్ టాపిక్. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యువ నేత. నందికొట్కూరు రాజకీయాల్లో ఇప్పుడో సంచలనం. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ప్రసంగాలకు యూట్యూబ్‌లో భారీగా వ్యూస్ వస్తున్నాయి. మొన్నటి ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. నందికొట్కూరు రాజకీయాల్లో పట్టు సాధించారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పెద్ద నాన్న బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. ఈయన వారసుడిగా సిద్ధార్థ రాజకీయాల్లోకి వచ్చారు. అయితే పెద్దనాన్నను పక్కన పెట్టి ఈయన వైసీపీలో చేరారు. సొంతంగా రాజకీయాలు […]
కర్నూలు రాజకీయాల్లో ఇప్పుడో హాట్ టాపిక్. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యువ నేత. నందికొట్కూరు రాజకీయాల్లో ఇప్పుడో సంచలనం. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ప్రసంగాలకు యూట్యూబ్‌లో భారీగా వ్యూస్ వస్తున్నాయి. మొన్నటి ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. నందికొట్కూరు రాజకీయాల్లో పట్టు సాధించారు.
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పెద్ద నాన్న బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. ఈయన వారసుడిగా సిద్ధార్థ రాజకీయాల్లోకి వచ్చారు. అయితే పెద్దనాన్నను పక్కన పెట్టి ఈయన వైసీపీలో చేరారు. సొంతంగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇప్పుడు తన వారసురాలిగా కూతురిని రాజకీయాల్లోకి దింపారు. ఆమెపేరు బైరెడ్డి శబరి రెడ్డి.
ఇన్నాళ్లు ఆమె ఎక్కడా కనిపించలేదు. కానీ ఈమధ్య బీజేపీలో చేరి ఈమె కూడా కమలం కండువా కప్పుకున్నారు. అప్పటినుంచి యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉంటున్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సిద్ధార్థ రెడ్డికి పోటీగా సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు.
అసలు మొదట్నుంచీ జగన్ అంటేనే బైరెడ్డి ఫ్యామిలీకి అస్సలు పడదు. జగన్ పేరు చెబితేనే అంతెత్తున ఎగిసిపడే పెదనాన్నకు చెప్పకుండానే సిద్ధార్ద రెడ్డి వైసీపీ కండువా కప్పేసుకున్నాడు. కానీ ఈవిషయంపై బైరెడ్డి బహిరంగంగా పెద్దగా విమర్శించకపోయినా.. లోకల్ గా సిద్ధార్ధకు వ్యతిరేకంగా పనిచేసుకుంటూ పోతున్నారన్న టాక్ నడుస్తోంది.
అందుకే ఎప్పుడూ తండ్రి చాటు బిడ్డగా ఉండే శబరిని…సిద్ధార్ధరెడ్డి మీద ఉన్న కోపంతోనే రాజకీయాల్లోకి తెచ్చారన్న గుసగుస వినిపిస్తోంది. ఎలాగైనా కూతుర్ని రాజకీయాల్లో రాణించేలా… ప్రత్యర్ధిని దెబ్బకొట్టేలా చేయాలన్నది బైరెడ్డి ప్లాన్.
మరి సిద్ధార్ధరెడ్డితో పోల్చితే శబరి బాగా వెనుకపడ్డారనే ప్రచారం జరుగుతోంది. ఏతావాతా కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఆమె ఉండి ఏం సాధిస్తారనే టాక్ వినిపిస్తోంది. అయినా తండ్రి అండతో… మహిళా కార్డుతో గట్టెక్కాలని ఆమె భావిస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడూ మైక్ ముందుకొచ్చి సిద్ధార్ధరెడ్డినే టార్గెట్ చేసుకుని ఆమె స్పీచ్ లు ఇస్తోంది. బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదని …రాయలసీమ ప్రజల కోసం తాను ఏమైనా చేస్తానంటూ చెప్పుకొస్తున్నారు.