కోళ్లకే కాదు... పందులకూ ఉంది సంక్రాంతి పందెం... ఇది నిజం!
సంక్రాంతి అంటే కోడి పందేలే అని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొందరు ఔత్సాహికులు పందులకూ పందేలు పెట్టారు. లక్షలకు లక్షలు డబ్బులు బెట్టింగ్ పెట్టారు. గెలిచిన వారు పండగ చేసుకున్నారు. ఇది కూడా సంప్రదాయంగా వస్తున్న వ్యవహారమే అని చెప్పారు. ఎవరి ప్రాణానికి హాని కలిగించకుండా ఏ పందెం నిర్వహిస్తే ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో జరిగిన ఈ పోటీల్లో.. చాలా జిల్లాల నుంచి వచ్చిన పందుల పెంపకందారులు.. తమ […]
సంక్రాంతి అంటే కోడి పందేలే అని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొందరు ఔత్సాహికులు పందులకూ పందేలు పెట్టారు. లక్షలకు లక్షలు డబ్బులు బెట్టింగ్ పెట్టారు. గెలిచిన వారు పండగ చేసుకున్నారు. ఇది కూడా సంప్రదాయంగా వస్తున్న వ్యవహారమే అని చెప్పారు. ఎవరి ప్రాణానికి హాని కలిగించకుండా ఏ పందెం నిర్వహిస్తే ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
తాడేపల్లిగూడెంలో జరిగిన ఈ పోటీల్లో.. చాలా జిల్లాల నుంచి వచ్చిన పందుల పెంపకందారులు.. తమ పందులను ఇందులో పోటీకి దింపారు. వీటిలో తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా పందులు విజేతలుగా నిలిచి.. శభాష్ అనిపించుకున్నాయి. తమ యజమానులకు డబ్బులు తెచ్చిపెట్టాయి. ఇది చూసిన కొందరు.. విస్తు పోతుంటే.. మరికొందరు ఇదో వింత ప్రయత్నం అని లైట్ తీసుకుంటున్నారు.
ఇక.. నిర్వాహకుల విషయానికి వస్తే.. తాము మూగ జీవాలకు హాని కలగకుండా పోటీలు నిర్వహిస్తున్నామని.. ఇందులో తప్పేం లేదని సమర్థించుకున్నారు. ఆలోచిస్తుంటే వారి వాదన కూడా కరెక్టే అనిపించింది. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి.. వాటి రక్తాలతో ఆడుకుంటున్నవారి కంటే.. ఇలా మూగజీవాలకు ఇబ్బంది లేకుండా పోటీలు పెడితే మంచిదే కదా.. అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
కాకపోతే.. సంక్రాంతి కోడి పందేల జాబితాలోకి పొట్టేళ్లు, ఎడ్ల పందేలు చేరినట్టే పందుల పోటీలు కూడా చేరిపోయాయి. రేపు.. ఈ జాబితాలో ఇంకేం వస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది.