సీఎం జగన్ తిరుపతిని క్రైస్తవీకరణ చేస్తున్నాడనేది దుష్ర్పచారమే

వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఒక వర్గం నాయకులు ఆయనపై మతపరమైన బురద జల్లడం ప్రారంభించారు. ఇందులో ఎక్కువ టీడీపీ, బీజేపీ నాయకుల అవాస్తవమైన వ్యాఖ్యలే ఉన్నాయి. ఎన్నోసార్లు అధికార వైసీపీ పార్టీ కూడా ఈ ప్రచారాన్ని ఖండించింది. కాని ఏనాడూ ఈ అబద్దపు ప్రచారాన్ని మాత్రం ఆపలేదు. తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తిరుపతి, తిరుమల క్రైస్తవీకరణ గురించి స్పందించారు. ఆదివారం తిరుమల దర్శనానికి వచ్చిన ఆయన మీడియాతో […]

Advertisement
Update:2019-12-30 03:20 IST

వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఒక వర్గం నాయకులు ఆయనపై మతపరమైన బురద జల్లడం ప్రారంభించారు. ఇందులో ఎక్కువ టీడీపీ, బీజేపీ నాయకుల అవాస్తవమైన వ్యాఖ్యలే ఉన్నాయి. ఎన్నోసార్లు అధికార వైసీపీ పార్టీ కూడా ఈ ప్రచారాన్ని ఖండించింది. కాని ఏనాడూ ఈ అబద్దపు ప్రచారాన్ని మాత్రం ఆపలేదు.

తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తిరుపతి, తిరుమల క్రైస్తవీకరణ గురించి స్పందించారు. ఆదివారం తిరుమల దర్శనానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిని క్రైస్తవీకరణ చేయడానికి పూనుకొన్నాడనే విషయం దుష్ర్పచారమని తేల్చి చెప్పారు. విపక్షాలు వైఎస్ జగన్‌పై క్రైస్తవ మతప్రచార బురదను జల్లుతున్నారు… కానీ సీఎం జగన్ అలా చేస్తాడని తాను నమ్మట్లేదని ఆయన స్పష్టం చేశారు.

గతంలో కూడా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్రైస్తవుడంటూ అబద్దప్రచారం చేశారు. కాని నాకు ఆయన స్వయంగా తెలుసు. సుబ్బారెడ్డి హిందూ మతాన్ని ఆచరించే భక్తుడు, ఆయన భార్య అయితే వెంకటేశ్వరస్వామికి ఎంతో నిబద్దత కలిగిన భక్తురాలని సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు.

పూజారులకు గతంలో దేవాలయాలపై ఉన్న హక్కులను ఏపీ ప్రభుత్వం తిరిగి పునరుద్దరించేలా చర్యలు తీసుకోవడాన్ని తాను స్వాగతిస్తున్నానని ఎంపీ వెల్లడించారు. హిందూ సమాజం కోసం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు తప్పకుండా వారిలో తిరిగి మనోధైర్యాన్ని నింపుతాయని ఎంపీ అభిప్రాయపడ్డారు.

గత ప్రభుత్వ హయాంలో పూజారులను వేధించారు.. అంతే కాకుండా టీటీడీకి చెందిన ఆస్తులు, నిధులు కూడా పక్కదారి పట్టినట్లు సమాచారం ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వం తప్పకుండా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News