విశాఖను అడ్డుకునేందుకు చంద్రబాబు న్యాయవ్యవస్థలను వాడుకుంటున్నారు...

విశాఖను పరిపాలన రాజధాని కాకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇందు కోసం న్యాయస్థానాలను కూడా చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. పరిపాలన రాజధానికి న్యాయపరమైన చిక్కులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. కొందరు వ్యక్తుల ప్రమేయంతో ఉత్తరాంధ్రకు చంద్రబాబు తీరని ద్రోహం చేసేందుకు సిద్ధపడుతున్నారన్నారు. అమరావతిలోని తన భూముల కోసం చంద్రబాబు స్వార్థపూరితంగా ఆలోచిస్తూ కుట్ర చేస్తున్నారన్నారు. అమరావతిలో ఆస్తులు కూడబెట్టుకోవాలన్న తలంపుతో చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం […]

Advertisement
Update:2019-12-28 08:42 IST

విశాఖను పరిపాలన రాజధాని కాకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇందు కోసం న్యాయస్థానాలను కూడా చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. పరిపాలన రాజధానికి న్యాయపరమైన చిక్కులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు.

కొందరు వ్యక్తుల ప్రమేయంతో ఉత్తరాంధ్రకు చంద్రబాబు తీరని ద్రోహం చేసేందుకు సిద్ధపడుతున్నారన్నారు. అమరావతిలోని తన భూముల కోసం చంద్రబాబు స్వార్థపూరితంగా ఆలోచిస్తూ కుట్ర చేస్తున్నారన్నారు. అమరావతిలో ఆస్తులు కూడబెట్టుకోవాలన్న తలంపుతో చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు.

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంటే… చంద్రబాబు మాత్రం తాను, తన వారు మాత్రమే బాగుంటే చాలు అన్న బుద్దితో పనిచేస్తున్నారన్నారు. కుటిల స్వభావం, స్వార్థబుద్ది ఉన్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడు ప్రపంచంలోనే ఎక్కడా లేరన్నారు.

Tags:    
Advertisement

Similar News