ఉత్తమ్ ఆవేదన.... నన్ను తిడితే స్పందించరా?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన చెందారు.. తనను టీఆర్ఎస్ వాళ్లు తిడితే ఒక్క కాంగ్రెస్ నేత కూడా స్పందించరా అని ఆవేదన వ్యక్తం చేశారట.. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై తాను మాట్లాడితే టీఆర్ఎస్ ఎదురుదాడి చేసిందని.. కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులను ఉత్తమ్ నిలదీసినట్టు తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఇందులో 28న నిర్వహించే పౌరసత్వ సవరణచట్టం […]

Advertisement
Update:2019-12-27 02:15 IST

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన చెందారు.. తనను టీఆర్ఎస్ వాళ్లు తిడితే ఒక్క కాంగ్రెస్ నేత కూడా స్పందించరా అని ఆవేదన వ్యక్తం చేశారట.. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై తాను మాట్లాడితే టీఆర్ఎస్ ఎదురుదాడి చేసిందని.. కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులను ఉత్తమ్ నిలదీసినట్టు తెలిసింది.

తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఇందులో 28న నిర్వహించే పౌరసత్వ సవరణచట్టం నిరసన ర్యాలీపై చర్చించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.

అయితే దీనికి కౌంటర్ ఇచ్చిన సీనియర్ నేత షబ్బీర్ అలీ.. మాట్లాడకపోవడం పొరపాటేనని అన్నారు.

ఇలా పీసీసీ ఛీప్ అయ్యాక ఉత్తమ్ తొలిసారిగా తన ఆవేదనను, ఆందోళనను బయటపెట్టి కాంగ్రెస్ నేతలను నిలదీయడం తెలంగాణ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది.

Tags:    
Advertisement

Similar News