3 రాజధానులు... డిఫెన్స్ లో బాబు... జగన్ కు అనూహ్య మద్దతు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనకు రాష్ట్రవ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తోంది. మూడు రాజధానులపై ఇంకా తుది నిర్ణయం రాకముందే ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల వాసులు, రాయలసీమలోని నాలుగు జిల్లాల ప్రజలు మద్దతు తెలుపుతుండడం విశేషంగా మారింది. రాయలసీమ కలగా మారిన హైకోర్టు ఏర్పాటును జగన్ ప్రకటించడంతో అక్కడి వాసులు సంబరాలు చేసుకున్నారు. ఇక విశాఖలో అడ్మినిస్ట్రేటివ్ రాజధాని ఏర్పాటుపై టీడీపీ ఉత్తరాంధ్ర నేతలతో సహా ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. దీని […]

Advertisement
Update:2019-12-22 12:17 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనకు రాష్ట్రవ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తోంది. మూడు రాజధానులపై ఇంకా తుది నిర్ణయం రాకముందే ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల వాసులు, రాయలసీమలోని నాలుగు జిల్లాల ప్రజలు మద్దతు తెలుపుతుండడం విశేషంగా మారింది.

రాయలసీమ కలగా మారిన హైకోర్టు ఏర్పాటును జగన్ ప్రకటించడంతో అక్కడి వాసులు సంబరాలు చేసుకున్నారు. ఇక విశాఖలో అడ్మినిస్ట్రేటివ్ రాజధాని ఏర్పాటుపై టీడీపీ ఉత్తరాంధ్ర నేతలతో సహా ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. దీని వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ది చెందుతుందని వారంతా ఆశపడుతున్నారు.

ఇక కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ప్రతిపాదనపై నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా మద్దతు లభిస్తుండడం విశేషం. అక్కడి వారు తమకు హైకోర్టు చేరువ అవుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, రాయలసీమలో 52 నియోజకవర్గాలున్నాయి. అంటే మొత్తం 86 అసెంబ్లీ స్థానాల ప్రజలు జగన్ చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతుగా ఉన్నారు. వీరే కాదు తూర్పుగోదావరి వాసులు కూడా విశాఖ రాజధానికి మద్దతుగా నిలుస్తున్నారు. అంటే అవో 19 సీట్లు…. నెల్లూరు, ప్రకాశం 22 సీట్లు కూడా కర్నూలులో హైకోర్టును స్వాగతిస్తున్నారు.

ఇక మిగిలిన గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా పెద్దగా ఎటువంటి ప్రతిఘటన లేనందుకున ఈ జిల్లాల్లో వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ జగన్ కు పెద్దగా నష్టం లేదు.

విశ్లేషకుల అంచనా ప్రకారం.. జగన్ ప్రకటించిన మూడు రాజధానుల నిర్ణయం కృష్ణ, గుంటూరు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో తప్ప రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం లేదు. పైగా మెజార్టీ ప్రజలను జగన్ ఈ నిర్ణయంతో సంతృప్తి పరిచాడు. ఎక్కువమంది జనాలను జగన్ నిర్ణయం సంతృప్తపరచబట్టే…. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ విషయంలో పోరాటానికి వెనుకా ముందు అవుతున్నట్టు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News