జ‌గ‌న్ దెబ్బ‌కు టీడీపీ విల‌విల.... రాజ‌ధానుల పై భిన్న‌స్వ‌రాలు

టీడీపీలో మ‌రో ధిక్కార స్వ‌రం బ‌య‌ట‌ప‌డింది. ఏపీ సీఎం జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌పై టీడీపీ లైన్‌కు భిన్నంగా ఆ పార్టీ ఎమ్మెల్యే స్వ‌రం వినిపించారు. విశాఖ‌ప‌ట్నంలో ప‌రిపాల‌న రాజ‌ధానిగా మార్చే అవ‌కాశం ఉందంటూ ముఖ్య‌మంత్రి శాస‌న‌స‌భ‌లో చేసిన ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తిస్తున్నట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు ట్వీట్ చేశారు. సహ‌జ‌సిద్ద‌మైన స‌ముద్ర‌తీర న‌గ‌రం విశాఖ‌ను పరిపాల‌న రాజ‌ధాని చేయ‌డం మంచి నిర్ణ‌య‌మ‌ని అన్నారు. రోడ్‌, రైల్‌, ఎయిర్‌, వాట‌ర్ క‌నెక్టివిటీతో విశాఖ ప‌రిపాల‌న రాజ‌ధానిగా అంద‌రి ఆశ‌లు, […]

Advertisement
Update:2019-12-18 02:47 IST

టీడీపీలో మ‌రో ధిక్కార స్వ‌రం బ‌య‌ట‌ప‌డింది. ఏపీ సీఎం జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌పై టీడీపీ లైన్‌కు భిన్నంగా ఆ పార్టీ ఎమ్మెల్యే స్వ‌రం వినిపించారు. విశాఖ‌ప‌ట్నంలో ప‌రిపాల‌న రాజ‌ధానిగా మార్చే అవ‌కాశం ఉందంటూ ముఖ్య‌మంత్రి శాస‌న‌స‌భ‌లో చేసిన ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తిస్తున్నట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు ట్వీట్ చేశారు.

సహ‌జ‌సిద్ద‌మైన స‌ముద్ర‌తీర న‌గ‌రం విశాఖ‌ను పరిపాల‌న రాజ‌ధాని చేయ‌డం మంచి నిర్ణ‌య‌మ‌ని అన్నారు. రోడ్‌, రైల్‌, ఎయిర్‌, వాట‌ర్ క‌నెక్టివిటీతో విశాఖ ప‌రిపాల‌న రాజ‌ధానిగా అంద‌రి ఆశ‌లు, ఆకాంక్ష‌లు నెర‌వేర్చే న‌గ‌రంగా మారుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని చెప్పుకొచ్చారు.

కాస్మో మెట్రో న‌గరం ప‌రిపాల‌న కేంద్రంగా కూడా మారితే విశ్వ‌న‌గ‌రంగా ప్ర‌సిద్ధి చెంద‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. విశాఖ‌ను ప‌రిపాల‌న న‌గ‌రంగా మారిస్తే ప్ర‌జ‌లు త‌మ స‌హ‌కారాన్ని అందించ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు. మొత్తానికి గంటా ట్వీట్లు ఇప్పుడు పార్టీ నిర్ణ‌యాన్ని ధిక్క‌రించే విధంగా ఉన్నాయి.

అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండాల‌న్న టీడీపీ స్టాండ్‌కు భిన్నంగా జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌ను గంటా స్వాగ‌తించారు. దీంతో ఈయ‌న కూడా పార్టీకి దూరంగా జ‌ర‌గాల‌ని నిర్ణయించుకున్న‌ట్లు తెలుస్తోంది.

మొత్తానికి అటు క‌ర్నూలు నేత‌లు కూడా హైకోర్టు నిర్ణ‌యాన్ని స్వాగ‌తించాల్సిన ప‌రిస్థితి. టీడీపీ నేత‌లు ప్రాంతాల వారీగా విడిపోయి మాట్లాడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిప‌డింది. జ‌గ‌న్ మైండ్‌గేమ్‌తో చంద్రబాబు బ్యాచ్ ఏం చేయాలో తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతోంది.

Tags:    
Advertisement

Similar News