ముషారఫ్‌కు ఉరి శిక్ష

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు పెషావర్ హై కోర్టు ఉరి శిక్ష విధించింది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి దేశంలో ఎమర్జెన్సీ విధించిన కేసులో ఆయనకు ఈ శిక్ష పడింది. ప్రజాస్వామ్యపాలనను కూలదోసి 2007 నవంబర్‌ 3న పాకిస్తాన్‌లో ముషారఫ్ ఎమర్జెన్సీ విధించారు. 2013లో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు అయింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు అభియోగాలు నిరూపితం కావడంతో ఉరి శిక్ష విధించింది. ప్రస్తుతం ముషారఫ్‌ దుబాయ్‌లో తలదాచుకుంటున్నాడు. 2016లో చికిత్స కోసమంటూ దుబాయ్‌ వెళ్లిపోయిన […]

Advertisement
Update:2019-12-17 09:11 IST

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు పెషావర్ హై కోర్టు ఉరి శిక్ష విధించింది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి దేశంలో ఎమర్జెన్సీ విధించిన కేసులో ఆయనకు ఈ శిక్ష పడింది. ప్రజాస్వామ్యపాలనను కూలదోసి 2007 నవంబర్‌ 3న పాకిస్తాన్‌లో ముషారఫ్ ఎమర్జెన్సీ విధించారు.

2013లో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు అయింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు అభియోగాలు నిరూపితం కావడంతో ఉరి శిక్ష విధించింది. ప్రస్తుతం ముషారఫ్‌ దుబాయ్‌లో తలదాచుకుంటున్నాడు.

2016లో చికిత్స కోసమంటూ దుబాయ్‌ వెళ్లిపోయిన ముషారఫ్ ఆ తర్వాత పాకిస్థాన్‌ వైపు రాలేదు. కేసులకు భయపడి అక్కడే దాక్కుంటున్నాడు. దుబాయ్‌ నుంచి ముషారఫ్‌ను రప్పించడం కూడా ఇప్పుడు పాక్‌ ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గానే భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News