పాక్ క్రికెటర్ అబీద్ అలీ అరుదైన రికార్డు

టెస్ట్, వన్డే అరంగేట్రంలోనే సెంచరీల మోత ఊబకాయంతో పాక్ టెస్టుజట్టులో చోటు లేకుండా పోయిన యువఆటగాడు అబీద్ అలీ…. కఠోరదీక్ష, శ్రమతో తానేమిటో నిరూపించుకొన్నాడు. తగిన ఫిట్ నెస్ తో పాక్ జట్టులో చోటు సంపాదించడమే కాదు…వన్డే, టెస్ట్ అరంగేట్రం మ్యాచ్ ల్లోనూ సెంచరీలు బాది వారేవ్వా అనిపించుకొన్నాడు. 2019 మార్చిలో ఆస్ట్ర్రేలియాతో సిరీస్ ద్వారా వన్డే అరంగేట్రం చేసిన అబీద్ అలీ 112 పరుగులతో తానేమిటో చాటి చెప్పాడు. అంతేకాదు…సొంతగడ్డపై పదేళ్ల విరామం తర్వాత రావల్పిండి వేదికగా శ్రీలంకతో […]

Advertisement
Update:2019-12-17 05:30 IST
  • టెస్ట్, వన్డే అరంగేట్రంలోనే సెంచరీల మోత

ఊబకాయంతో పాక్ టెస్టుజట్టులో చోటు లేకుండా పోయిన యువఆటగాడు అబీద్ అలీ…. కఠోరదీక్ష, శ్రమతో తానేమిటో నిరూపించుకొన్నాడు. తగిన ఫిట్ నెస్ తో పాక్ జట్టులో చోటు సంపాదించడమే కాదు…వన్డే, టెస్ట్ అరంగేట్రం మ్యాచ్ ల్లోనూ సెంచరీలు బాది వారేవ్వా అనిపించుకొన్నాడు.

2019 మార్చిలో ఆస్ట్ర్రేలియాతో సిరీస్ ద్వారా వన్డే అరంగేట్రం చేసిన అబీద్ అలీ 112 పరుగులతో తానేమిటో చాటి చెప్పాడు. అంతేకాదు…సొంతగడ్డపై పదేళ్ల విరామం తర్వాత రావల్పిండి వేదికగా శ్రీలంకతో ముగిసిన తొలిటెస్ట్ ద్వారా టెస్ట్ అరంగేట్రం చేసిన అబీద్ అలీ 109 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

32 సంవత్సరాల లేటు వయసులో అబీద్ అలీ అరుదైన అరంగేట్రం సెంచరీల రికార్డు సొంతం చేసుకోడం విశేషం.

భారత క్రికెటర్ సచిన్ టెండుల్కరన్ ను విపరీతంగా అభిమానించే అబీద్ అలీకి తన జీవితకాలంలో ఒక్కసారైనా మాస్టర్ ను కలుసుకోగలిగితే చాలునని భావిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News