ఒక ఉద్యోగిని పట్టుకుని చంద్రబాబు బాస్టర్డ్ అనడం ఎంత వరకు కరెక్ట్ ?

ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడి తీరు ఎంత దారుణంగా ఉందో మార్షల్స్‌ పట్ల ఆయన వ్యవహరించిన వీడియోలను చూస్తుంటే అర్థమవుతోందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు గేటు-2 నుంచి రావాల్సి ఉంటుందని..కానీ నిన్న మాత్రం అలా చేయకుండా ఊరేగింపుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలను వెంటేసుకుని వచ్చారన్నారు. అలా గుంపుగా అసెంబ్లీలోకి వస్తుండడంతో ఎవరు సభ్యులో, ఎవరు సభ్యులు కాదో అర్థం కాక… మార్షల్స్‌ గేటు వేసి సభ్యులు మాత్రమే లోపలికి రావాలని కోరారని.. […]

Advertisement
Update:2019-12-13 05:47 IST

ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడి తీరు ఎంత దారుణంగా ఉందో మార్షల్స్‌ పట్ల ఆయన వ్యవహరించిన వీడియోలను చూస్తుంటే అర్థమవుతోందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు గేటు-2 నుంచి రావాల్సి ఉంటుందని..కానీ నిన్న మాత్రం అలా చేయకుండా ఊరేగింపుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలను వెంటేసుకుని వచ్చారన్నారు.

అలా గుంపుగా అసెంబ్లీలోకి వస్తుండడంతో ఎవరు సభ్యులో, ఎవరు సభ్యులు కాదో అర్థం కాక… మార్షల్స్‌ గేటు వేసి సభ్యులు మాత్రమే లోపలికి రావాలని కోరారని.. అందులో తప్పేముందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

ఎవరు ఎవరి మీద దాడి చేశారన్నది వీడియోల్లో స్పష్టంగా ఉందన్నారు. ఒక ఉద్యోగిని పట్టుకుని చంద్రబాబు బాస్టర్డ్ అని తిట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు తీరు ఎంత దారుణంగా ఉందో ఆ వీడియోను చూస్తే అర్థమవుతుందన్నారు.

మార్షల్స్‌పై దాడి చేస్తే చర్యలు తీసుకోకుండా చూస్తూ ఉండాలా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని నిలదీశారు.

Tags:    
Advertisement

Similar News