ఎన్టీఆర్‌ను దించిన పాపంలో నేనూ భాగస్వామినే... అందుకే భగవంతుడు 15ఏళ్లు అధికారం లేకుండా చేశాడు...
అసెంబ్లీని వైసీపీ కార్యాలయం అంటూ టీడీపీ సభ్యులు వ్యాఖ్యానించడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పదాన్ని టీడీపీ నేతలు వెనక్కు తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిదన్నారు. ఇలాంటి అసెంబ్లీపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని… టీడీపీ ఎమ్మెల్యేల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. అసెంబ్లీ మీ జాగీరా అని చంద్రబాబు వ్యాఖ్యానించడం సరికాదని… అసెంబ్లీ అన్నది ఎవరి జాగీరు కాదన్న విషయం అందరూ గుర్తించుకోవాలన్నారు. ఎన్టీఆర్‌కు గతంలో అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదు అన్నది నిజమని… […]
అసెంబ్లీని వైసీపీ కార్యాలయం అంటూ టీడీపీ సభ్యులు వ్యాఖ్యానించడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పదాన్ని టీడీపీ నేతలు వెనక్కు తీసుకోవాలని సూచించారు.
అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిదన్నారు. ఇలాంటి అసెంబ్లీపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని… టీడీపీ ఎమ్మెల్యేల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.
అసెంబ్లీ మీ జాగీరా అని చంద్రబాబు వ్యాఖ్యానించడం సరికాదని… అసెంబ్లీ అన్నది ఎవరి జాగీరు కాదన్న విషయం అందరూ గుర్తించుకోవాలన్నారు.
ఎన్టీఆర్‌కు గతంలో అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదు అన్నది నిజమని… ఆ ఘట్టంలో… ఆ పాపంలో తన భాగస్వామ్యం కూడా ఉందన్నారు. దానికి చాలా బాధపడ్డానని… అందులో భాగస్వామ్యంగా ఉన్నందుకే భగవంతుడు 15 ఏళ్లు అధికారానికి దూరం చేశారని స్పీకర్ వ్యాఖ్యానించారు.