టాప్10 లో ముఖేష్ అంబానీ

ప్రపంచంలోనే టాప్ 10 ధనవంతుల జాబితా తాజాగా రిలీజ్ అయ్యింది. తాజాగా ఫోర్బ్స్ ‘ది రియల్ – టైమ్ బిలియనీర్ల’ జాబితాను విడుదల చేసింది. 60 బిలియన్ డాలర్ల వ్యక్తిగత ఆస్తితో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో ఏకంగా 9వ స్థానంలో నిలిచి సంచలనం సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా కుబేరుల జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు సీఈవో జెఫ్ బెజోన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 2019 సంవత్సరానికి ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ 9వ […]

Advertisement
Update:2019-11-30 10:30 IST

ప్రపంచంలోనే టాప్ 10 ధనవంతుల జాబితా తాజాగా రిలీజ్ అయ్యింది. తాజాగా ఫోర్బ్స్ ‘ది రియల్ – టైమ్ బిలియనీర్ల’ జాబితాను విడుదల చేసింది. 60 బిలియన్ డాలర్ల వ్యక్తిగత ఆస్తితో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో ఏకంగా 9వ స్థానంలో నిలిచి సంచలనం సృష్టించారు.

ప్రపంచవ్యాప్తంగా కుబేరుల జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు సీఈవో జెఫ్ బెజోన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 2019 సంవత్సరానికి ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ 9వ స్థానంలో నిలవడం విశేషం.

ప్రస్తుతం ప్రపంచంలోనే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 113 బిలియన్ డాలర్ల సంపాదనతో మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ 107.4 బిలయన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక బెర్నార్డ్ అర్నాల్డ్ 107.2 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు.

ఆ తర్వాత స్థానాల్లో వరుసగా లూయిస్ వ్యూట్టిన్, వారెన్ బఫెట్, ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ , మాన్ సియో, ఎల్లిసన్, కార్లోస్ సిమ్ , అల్ఫాబెట్ లారీ పేజ్ లు తర్వాతి స్థానాలలో ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News