కాలిఫోర్నియాలో హిందూ ఆలయంపై దాడి.. ఖండించిన భారత్
ఈ ఘటనకు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను డిమాండ్ చేసిన భారత్;
అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ ఆలయంపై దాడి జరిగింది. చినో హిల్స్ లోని బాప్స్ స్వామినారాయణ్ మందిరంపై పెయింట్‌తో కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాశారు. ఆయన అధికారులు ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ దుశ్చర్యను భారత ప్రభుత్వం ఖండించింది.
విదేశాంగశాఖ ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కాలిఫోర్నియా చినో హిల్స్‌లోని హిందూ దేవాలయంపై జరిగిన దాడి వార్తలను చూశాం. ఇలాంటి హేయమైన చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనకు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ప్రార్థనా స్థాలకు తగిన భద్రత కల్పించాలని కోరుతున్నాం అని జైశ్వాల్ పేర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లోనూ ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. కాలిఫోర్నియా శాఖ్రమెంటోలోని బాప్స్ శ్రీ స్వామి నారాయణ ఆలయంపై విద్వేషపూరిత రాతలు రాశారు. దీనికిముందు కూడా న్యూయార్క్‌లోని బాప్స్ మందిరం వద్ద దుండగులు ఇదేవిధంగా ప్రవర్థించారు.