ఆస్కార్ అవార్డుల విజేతల ప్రకటన..ఉత్తమ చిత్రం ఎందంటే?
సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, అత్యున్నతమైన ఆస్కార్ అవార్డులను ప్రకటించారు;
లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 97వ ఆస్కార్ అకాడమీ అవార్డు వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. హాలీవుడ్ స్టార్స్ సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఆస్కార్ అవార్డుల హోస్ట్‌గా అమేలియా డిమోల్డెన్‌బర్గ్ వ్యవహరించారు. అరియానా గ్రాండే, సింథియా ఎరివో, డోజా క్యాట్, లిసా, క్వీన్ లతీఫా, రేయ్‌లు తమ ప్రదర్శనతో ఆహూతులను అలరించారు. ఎ రియల్ పెయిన్' చిత్రంలో నటనకు గానూ కీరన్ కైల్ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా.. 'ఎమిలియా పెరెజ్'లో నటనకు జోయా సాల్దాన్ ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అందుకున్నారు. గత ఏడాది బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన 'డ్యూన్: పార్ట్ 2' ఉత్తమ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మనదేశం నుంచి నామినేషన్ సొంతం చేసుకున్న అనూజ మూవీకి నిరాశ ఎదురైంది. ఆ విభాగంలో ఐయామ్ నాట్ ఏ రోబో ఉత్తమ లఘు చిత్రంగా అవార్డును గెలుచుకుంది.
ఆస్కార్ విజేతలు వీరే..
ఉత్తమ సహాయ నటుడు - కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)
ఉత్తమ సహా నటి - జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే - అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే - కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాగన్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - వికెడ్ (పాల్ తేజ్‌వెల్)
ఉత్తమ మేకప్, హెయిల్‌స్టైల్ - ది సబ్‌స్టాన్స్
ఉత్తమ ఎడిటింగ్ - అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ - ది బ్రూటలిస్ట్ (లాల్ క్రాలే)
ఉత్తమ సౌండ్ - డ్యూన్: పార్ట్2
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ - డ్యూన్:పార్ట్2
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ - ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్)
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ - ఐయామ్ స్టిల్ హియర్ బ (వాల్టర్ సాల్లెస్)
ఉత్తమ ఒరిజినల్ స్కోర్ - ది బ్రూటలిస్ట్ (డానియల్ బ్లమ్‌బెర్గ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - వికెడ్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ - ఐయామ్ నాట్ ఏ రోబో
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ - నో అదర్ ల్యాండ్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ - ఫ్లో
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ - ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్