భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడు అతనే!
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎలాన్ మస్క్;
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో అగ్రరాజ్యానికి ఆయనే అధ్యక్షుడు అవుతారని అంచనా వేశారు. దేశానికి మంచి నాయకుడిగా ఉంటారంటూ 'ఎక్స్' వేదికగా కొనియాడారు.'అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న జేడీ వాన్స్ అత్యుత్తమంగా పనిచేస్తున్నారు. ఆయన దేశానికి కాబోయే అధ్యక్షుడు అంటూ మస్క్ ఓ పోస్టుకు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడలో మస్క్ కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టెస్లా అధినేత నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్).. ప్రభుత్వ విభాగాల్లో ప్రక్షాళన కోసం పలు కీలక విధానాలు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన అమెరికాకు భవిష్యత్తులో కాబోయే అధ్యక్షుడి విషయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.