గాజాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ ఓకే

ముస్లింల పవిత్ర మాసం రంజాన్‌ సందర్భంగా అమెరికా ప్రతిపాదనకు ఇజ్రాయెల్ అంగీకారం;

Advertisement
Update:2025-03-02 14:08 IST

ముస్లింల పవిత్ర మాసం రంజాన్‌ సందర్భంగా గాజాలో తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించడానికి ఇజ్రాయిల్‌ అంగీకరించింది. అమెరికా చేసిన ప్రతిపాదనకు తాము మద్దతు ఇస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని కార్యాలయం తెలిపింది. తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం శనివారంతో ముగిసిన వేళ..ఇజ్రాయెల్‌ ఈ నిర్ణయం తీసుకున్నది. ఒప్పందంలో భాగంగా తమ చెరలోని మృతదేహాలను హమాస్‌ రెడ్‌క్రాస్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ప్రతిగా తమ జైళ్లలోని పాలస్థీనా ఖైదీలకు ఇజ్రాయెల్‌ స్వేచ్ఛ కల్పించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఒప్పందం పొడిగింపు క్రమంలోనే రెండో దశ ఒప్పందంపై నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నది. రెండో దశపై చర్చలు ఈజిప్టు రాజధాని కైరో లో జరుగుతున్నాయి. అయితే ఆ చర్చలో ఎలాంటి పురోగతి తేదని హమాస్‌ ఆరోపించింది. ఇందులో హమాస్‌ నేరుగా పాల్గొనకపోయినా దాని అభిప్రాయాన్ని మధ్యవర్తులకు తెలుపుతోంది. 

Tags:    
Advertisement

Similar News