భారత్-పాకిస్థాన్ ప్రాంతంలో ప్రయాణించవద్దని తమ పౌరులను అమెరికా హెచ్చరించింది. ఇండో-పాక్ సరిహద్దు,నియంత్రణ రేఖ ప్రాంతాలు సహా పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్, ఖైబర్‌పక్తుంఖ్వా ప్రాంతంలో ప్రయాణించవద్దంటూ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో ఉగ్రదాడులు, సాయుధ పోరాటాలు జరిగే అవకాశం ఉన్నాయని పేర్కొన్నది. తమ ప్రయాణాలను పునః పరిశీలించుకోవాలని అమెరికా సూచించింది. అమెరికా ట్రావెల్ అడ్వైజరీ సూచించిన ప్రాంతాల్లో ఇటీవల ఉగ్రదాడులు జరిగాయి. పోలీసులు, సైన్యం పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సైనిక స్థావరాలు, ఎయిర్‌పోర్టులు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, ప్రార్థనా స్థలాలే లక్ష్యంగా దాడులు జరగగా చాలామంది చనిపోయారు.
Advertisement