లక్షమందికిపైగా ఇండియన్స్‌పై అమెరికా బహిష్కరణ ముప్పు!

మైనర్లుగా వెళ్లి 21 ఏళ్లు నిండుతుండుటంతో చిక్కుల్లో పడ్డ యువత;

Advertisement
Update:2025-03-07 11:56 IST

భారత్‌ నుంచి అమెరికాకు డిపెండెంట్‌ వీసాలపై వలస వెళ్లిన వేలాది మంది భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ట్రంప్‌ కఠిన నిబంధనలు, హెచ్‌1బీ1 వీసాదారుల అంశం భారతీయులను కలవరపాటునకు గురిచేస్తున్నది. లక్షమందికిపైగా భారతీయులకు అమెరికా బహిష్కరణ వేటు ముప్పు పొంచి ఉన్నట్లు విశ్లేషకులు తెలిపారు. 21 ఏళ్లు నిండిన వాళ్లు హెచ్‌- 4 డిపెండెంట్‌ వీసా అర్హత కోల్పోవడమే తాజా ఆందోళనకు దారితీస్తున్నది. ప్రస్తుత ఇమిగ్రేషన్‌ చట్టాల ప్రకారం హెచ్‌-4 వీసాపై అమెరికాకు వెళ్లిన 21 ఏళ్లు నిండిన వారు డిపెండెంట్‌ వీసా అర్హత కోల్పోతారు. కొత్త వీసా పునరుద్ధరణ కోసం రెండేళ్ల గడువు ఉంటుంది. డిపెండెంట్‌ వీసా అర్హత కోల్పోయిన వారు సరైన ధృవపత్రాలు లేని వారికి డిఫర్‌ యాక్షన్‌ ఫర్‌ ఛైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌ (డీఏసీఏ) దేశ బహిష్కరణ నుంచి తాత్కాలికంగా ఈ రెండేళ్ల రక్షణ అందిస్తుంది. అయితే ఇది చట్ట విరుద్ధమని దీనికి కింద వర్క్‌ పర్మిట్‌ పొందలేరని టెక్సాస్‌లోని కోర్టు తీర్పు ఇచ్చింది. ఫలితంగా భారతీయ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వీసా గడువు ముగిసేవారు ఉన్నత చదువుల కోసం ఎఫ్‌-1 వీసా పొందే అవకాశం ఉన్నప్పటికీ ఇది అనేక సవాళ్లతో ముడిపడి ఉన్నది. ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ కింద నమోదైతే స్కాలర్‌ షిప్‌ సహా ఇతర సౌకర్యాలకు దూరమౌతామనే ఆందోళన యువతలో నెలకొన్నది. 

Tags:    
Advertisement

Similar News