ఇంగ్లీష్‌ ను వ్యతిరేకించి బీసీల్లో వ్యతిరేకత తెచ్చుకున్నాం...

ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించినందుకు ఇప్పుడు టీడీపీ మథనపడుతోంది. ఇప్పటికే అపార నష్టం జరిగిపోయిందని ఆలస్యంగా గుర్తించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు… గొంతు సవరించుకున్నారు. తమ హయాంలోనే మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తెచ్చామని… తాము ఇంగ్లీష్‌కు వ్యతిరేకం కాదని గురువారం వ్యాఖ్యానించిన చంద్రబాబునాయుడు… పార్టీ నేతలకూ శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఇంగ్లీష్‌ మీడియంకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దని స్పష్టం చేశారు. ఇంగ్లీష్‌ను వ్యతిరేకించడం ద్వారా ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీల్లో కూడా వ్యతిరేకత […]

Advertisement
Update:2019-11-23 05:42 IST

ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించినందుకు ఇప్పుడు టీడీపీ మథనపడుతోంది. ఇప్పటికే అపార నష్టం జరిగిపోయిందని ఆలస్యంగా గుర్తించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు… గొంతు సవరించుకున్నారు. తమ హయాంలోనే మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తెచ్చామని… తాము ఇంగ్లీష్‌కు వ్యతిరేకం కాదని గురువారం వ్యాఖ్యానించిన చంద్రబాబునాయుడు… పార్టీ నేతలకూ శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఇకపై ఇంగ్లీష్‌ మీడియంకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దని స్పష్టం చేశారు. ఇంగ్లీష్‌ను వ్యతిరేకించడం ద్వారా ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీల్లో కూడా వ్యతిరేకత కొనితెచ్చుకున్నామని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

పేదలు, వెనుక బడిన వర్గాల వారు ఇంగ్లీష్‌లో చదువుకోకుండా టీడీపీ అడ్డుకుంటోందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు. వారు కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

మీడియా మాయలో పడి అనవసరంగా ఇంగ్లీష్‌ మీడియంకు టీడీపీ వ్యతిరేకం అన్న భావన కలిగించామని నేతలు అభిప్రాయపడ్డారు. ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న నేతలు, మీడియా పెద్దలు… వారి పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారన్న ప్రశ్న ప్రతి సామాన్యుడి నుంచి కూడా ఎదురైందని… ఇది ఒక విధంగా టీడీపీ వెనుకబడిన వర్గాల పార్టీ కాదు… ఉన్నోళ్ల పార్టీ అన్న ముద్ర వేయడానికి కారణమైందని అభిప్రాయపడ్డారు.

Tags:    
Advertisement

Similar News