ప్రపంచ అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ రికార్డు

భారత దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంలో కూరుకుపోయింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా రికార్డుల్లోకి ఎక్కింది. స్కైమెట్ విడుదల చేసిన రిపోర్టులో ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా ప్రపంచంలోనే తొలి స్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచంలో మరే నగరానికి సాధ్యం కానంత కాలుష్యంతో ఢిల్లీ నిండిపోయింది. ప్రస్తుతం ఢిల్లీ ఒక గ్యాస్‌ చాంబర్‌ను తలపిస్తోంది. మాస్క్ లేకుండా బయటకురాలేని పరిస్థితి. కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా ఉండడంతో ఆక్సిజన్ చాంబర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో సెలెక్ట్ […]

Advertisement
Update:2019-11-16 06:29 IST

భారత దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంలో కూరుకుపోయింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా రికార్డుల్లోకి ఎక్కింది. స్కైమెట్ విడుదల చేసిన రిపోర్టులో ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా ప్రపంచంలోనే తొలి స్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచంలో మరే నగరానికి సాధ్యం కానంత కాలుష్యంతో ఢిల్లీ నిండిపోయింది.

ప్రస్తుతం ఢిల్లీ ఒక గ్యాస్‌ చాంబర్‌ను తలపిస్తోంది. మాస్క్ లేకుండా బయటకురాలేని పరిస్థితి. కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా ఉండడంతో ఆక్సిజన్ చాంబర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో సెలెక్ట్ సిటీ వాక్ మాల్‌లోని ఆక్సీ ప్యూర్ బార్‌లో రూ.299 చెల్లిస్తే 15 నిమిషాల పాటు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పీల్చుకునే అవకాశం కల్పిస్తున్నారు.

స్కైమెట్ విడుదల చేసిన జాబితాలో అత్యంత కాలుష్యకరమైన పది నగరాల్లో భారత ఉపఖండానికి చెందిన నగరాలే ఆరు ఉన్నారు. ఢిల్లీలో వాయు నాణ్యత సూచి 527గా ఉంది. ఢిల్లీ తర్వాత అత్యంత కాలుష్యం లాహోర్‌లో రికార్డు అయింది. లాహోర్‌లో వాయు నాణ్యత సూచి 234గా ఉంది. కరాచీ 180, కోల్‌కతా 161, ముంబాయిలో 153గా వాయు నాణ్యత సూచి ఉంది.

వాయు నాణ్యత సూచి సున్నా నుంచి 50 ఏక్యూఐగా ఉంటే మంచి వాతారణంగా భావిస్తారు. ఏక్యూఐ 50-100 మధ్య ఉంటే సంతృప్తికరంగానూ, 101-200 వరకు ఉంటే మధ్యస్థంగానూ భావిస్తారు. 201-300 మధ్య ఉంటే అధ్వాన్న స్థితిగా, 301-400 మధ్య ఉంటే మరింత అధ్వాన్న స్థితిగా లెక్కిస్తారు. 401-500 మధ్య ఏక్యూఐ ఉంటే ప్రమాదకరమైక వాయు కాలుష్యంగా భావిస్తారు.

Tags:    
Advertisement

Similar News