ఐదేళ్ల జీతాన్ని రాసిచ్చిన ఆర్కే

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో స్వచ్చంద సంస్థలు, ప్రవాసాంధ్రులను భాగస్వామ్యం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ”కనెక్ట్‌ టూ ఆంధ్రా” కాన్సెప్ట్‌ను సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే విరాళాల కోసం ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి… ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా ఎన్‌ఆర్‌ఐలకు పిలుపునిచ్చారు. ప్రవాసాంధ్రులు తమ గ్రామం, తమ నియోజవర్గం, తమ జిల్లాలో ఏ […]

Advertisement
Update:2019-11-09 01:26 IST

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో స్వచ్చంద సంస్థలు, ప్రవాసాంధ్రులను భాగస్వామ్యం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ”కనెక్ట్‌ టూ ఆంధ్రా” కాన్సెప్ట్‌ను సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే విరాళాల కోసం ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు.

వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి… ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా ఎన్‌ఆర్‌ఐలకు పిలుపునిచ్చారు. ప్రవాసాంధ్రులు తమ గ్రామం, తమ నియోజవర్గం, తమ జిల్లాలో ఏ కార్యక్రమైనా చేపట్టవచ్చని కోరారు. మెరుగైన ఆంధ్ర ప్రదేశ్‌ నిర్మాణం కోసం కలిసి రావాలని ముఖ్యమంత్రి కోరారు.

ముఖ్యమంత్రి పిలుపుకు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెంటనే స్పందించారు. ”కనెక్ట్ టూ ఆంధ్రా” కార్యక్రమం కోసం తన జీతాన్ని విరాళంగా ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉండే ఐదేళ్ల కాలంలో వచ్చే తన జీతాన్ని నేరుగా ”కనెక్ట్ టూ ఆంధ్రా” కార్యక్రమానికి విరాళంగా అప్పగించాలని అసెంబ్లీ కార్యదర్శిని కలిసి ఎమ్మెల్యే ఆర్కే లేఖ అందజేశారు.

Tags:    
Advertisement

Similar News