కూతురు చనిపోయిందనుకున్నారు... కానీ 29 ఏళ్ల తరువాత కొడుకుగా పరిచయం కాబోతున్నాడు

తమ కూతురు.. పుట్టిన కొన్ని నిమిషాల్లోనే చనిపోయిందని బాధపడుతూ… ప్రతి యేటా ఆమె పుట్టిన రోజు పండుగ జరుపుకుంటూ వస్తున్నారు ఆ తల్లిదండ్రులు. ఇలా 29 యేళ్ల నుంచి కాలం వెళ్లదీస్తున్న వారికి ఒకరోజు ఒక ఇ మెయిల్ వచ్చింది. అది చనిపోయిందనుకున్న బిడ్డ నుంచి వచ్చినది కావడం తో వారు అవాక్కయ్యారు. తాను బతికే ఉన్నానని త్వరలోనే కలుస్తానని.. కాక పోతే కూతురిగా కాదు… ఒక కుమారుడిగా… అనేది దాని సారాంశం. టీనా బెజారానో అనే […]

Advertisement
Update:2019-10-18 00:10 IST

తమ కూతురు.. పుట్టిన కొన్ని నిమిషాల్లోనే చనిపోయిందని బాధపడుతూ… ప్రతి యేటా ఆమె పుట్టిన రోజు పండుగ జరుపుకుంటూ వస్తున్నారు ఆ తల్లిదండ్రులు. ఇలా 29 యేళ్ల నుంచి కాలం వెళ్లదీస్తున్న వారికి ఒకరోజు ఒక ఇ మెయిల్ వచ్చింది. అది చనిపోయిందనుకున్న బిడ్డ నుంచి వచ్చినది కావడం తో వారు అవాక్కయ్యారు. తాను బతికే ఉన్నానని త్వరలోనే కలుస్తానని.. కాక పోతే కూతురిగా కాదు… ఒక కుమారుడిగా… అనేది దాని సారాంశం.

టీనా బెజారానో అనే అమెరికా అమ్మాయికి పదిహేడేళ్ల వయసులో ఓ పాప పుట్టింది. కానీ పుట్టిన 15 నిమిషాలకే శిశువు చనిపోయిందని బెజారానో తల్లి చెప్పడం తో విపరీతంగా బాధపడింది.

జరిగిందేమంటే… బెజారానో అంత చిన్న వయసులో గర్భం ధరించడం ఆమె తల్లికి ఇష్టం లేదు. అందుకే శిశువు పుట్టిన వెంటనే చనిపోయిందని చెప్పింది. అయితే ఆ బిడ్డ ఏమయింది ఎవరికీ చెప్పలేదు. కానీ బెజారానో, ఆమె భర్త ఎరిక్ గార్డెరే ప్రతి సంవత్సరం చనిపోయిన పాప పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

కానీ దాదాపు మూడు దశాబ్దాల తరువాత…. టీనా బెజారానో, ఎరిక్ ల కుమార్తె డి ఎన్ ఎ పరీక్ష చేయించుకుంది. అది వీరి డి ఎన్ ఎ తో సరిపోలడంతో వీరే తన తల్లిదండ్రులని గ్రహించి వారికి ఆ 29 ఏళ్ల కూతురు(ఇప్పుడు కొడుకు), తన తల్లిదండ్రులకు ఇమెయిల్ చేసి, అందులో ‘‘మనం మాట్లాడవలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను… మీరు నా తల్లి అని ఇది చెబుతుంది’’ అని రాసింది.

“అతడు లింగ మార్పిడి చేసుకున్నాడా… లేదా అని నేను పట్టించుకోను. అతడు నాబిడ్డ. అతడు జీవించి ఉన్నందుకు మాకు సంతోషంగా ఉంది. అతడిని చూసి తనివి తీరా ఏడవాలని ఉంద” ని బెజారానో ఉబ్బి తబ్బిబ్బవుతున్నది.

నిజానికి పాప పుట్టిన ఐదు రోజుల తరువాత ఒక కుటుంబం దత్తత తీసుకుంది. పేరు క్రిస్టిన్. లాస్ వెగాస్‌లో పెరిగింది. ప్రస్తుతం లింగమార్పిడి చేయించుకుని క్రిస్టిన్ తన బిడ్డ, భార్యతో కలిసి న్యూజెర్సీలో నివసిస్తున్నాడు. అతను నవంబర్ లో లాస్ బానోస్ లో తన తల్లిని మొదటిసారి కలుసుకోబోతున్నాడు.

Tags:    
Advertisement

Similar News