2012లో కలాంను రాష్ట్రపతిని చేసింది మా నాన్నే

కొద్దికాలంగా ట్విట్టర్ ద్వారానే సురక్షితంగా ట్వీట్లు పెట్టుకుంటూ వస్తున్న నారా లోకేష్… మరోసారి దొరికిపోయారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ట్విట్టర్ నుంచి బయటకొచ్చిన లోకేష్ … ఆయనకు నివాళులర్పించారు. అనంతరం ప్రసంగించిన లోకేష్.. నోరు జారారు. చాలా కాలంగా లోకేష్ నోరుజారుడు లేకపోవడంతో ఉసూరుమంటున్న నెటిజన్లకు ఒక్కసారిగా పండగ వాతావరణం వచ్చేసింది. లోకేష్ నోరు జారిన వీడియోను బాగా వైరల్ చేస్తున్నారు. జయంతి కార్యక్రమంలో ప్రసంగించిన నారా లోకేష్ ఎప్పటిలాగే అబ్దుల్‌ కలాంను […]

Advertisement
Update:2019-10-16 01:33 IST

కొద్దికాలంగా ట్విట్టర్ ద్వారానే సురక్షితంగా ట్వీట్లు పెట్టుకుంటూ వస్తున్న నారా లోకేష్… మరోసారి దొరికిపోయారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ట్విట్టర్ నుంచి బయటకొచ్చిన లోకేష్ … ఆయనకు నివాళులర్పించారు. అనంతరం ప్రసంగించిన లోకేష్.. నోరు జారారు. చాలా కాలంగా లోకేష్ నోరుజారుడు లేకపోవడంతో ఉసూరుమంటున్న నెటిజన్లకు ఒక్కసారిగా పండగ వాతావరణం వచ్చేసింది.

లోకేష్ నోరు జారిన వీడియోను బాగా వైరల్ చేస్తున్నారు. జయంతి కార్యక్రమంలో ప్రసంగించిన నారా లోకేష్ ఎప్పటిలాగే అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిని చేసింది తన తండ్రి చంద్రబాబే అని చెప్పారు. ఎవరిని రాష్ట్రపతి చేయాలో తెలియక తన తండ్రిని నాటి ప్రధాని వాజ్‌పేయి సంప్రదించారని లోకేష్ చెప్పుకొచ్చారు.

ఈ అంశాన్ని వివరిస్తూనే ” 2012లో అప్పుడు ఒకసారి మనం చూసుకుంటే…. వాజ్‌పేయి గారు ప్రధానిగా భారతదేశానికి రాష్ట్రపతిగా ఎవరిని చేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు చంద్రబాబు గారు అబ్దుల్ కలాం గారి పేరును ప్రతిపాదించడం జరిగింది” అని లోకేష్ వ్యాఖ్యానించారు.

తొలుత లోకేష్ ప్రసంగంలోని హోల్స్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ లోకేష్‌ మాట్లాడారు అంటే ఏదో ఒక మూలన తన జీకే సామర్ధ్యాన్ని ప్రదర్శించే ఉంటారన్న ఉద్దేశంతో కాస్త తీక్షణంగా చూడగా… బిగినింగ్‌లోనే దొరికిపోయారు చినబాబు.

2012లో ప్రధానిగా వాజ్‌పేయి ఉన్నారట…. అప్పుడే బాబు గారు అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ప్రతిపాదించారట. కానీ 2012లో ప్రధానిగా ఉన్నది మన్మోహన్ సింగ్. అప్పటికే వాజ్‌పేయి క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు కూడా. కానీ లోకేష్ అలవాటులో పొరపాటున ఈ సృష్టిని అధిగమించి పదేళ్లు కాలాన్ని ముందుకు నెట్టారు.

నారా లోకేష్ ఇలా నోరు జారడం అటు టీడీపీ శ్రేణులకు చికాకు తెప్పిస్తోంది. నోరు జారుతారు అన్న బ్యాడ్‌ నేమ్‌ ఇప్పటికే ఉందని తెలిసి కూడా…. లోకేష్ కు ప్రసంగాలు సిద్ధం చేసే వారు… చిన్నచిన్న జాగ్రత్తలు కూడా తీసుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News