కశ్మీర్‌లో పునఃప్రారంభమైన మొబైల్ సేవలు... షరతులు వర్తిస్తాయి..!

జమ్ము కశ్మీర్‌లో రెండున్నర నెలల తర్వాత మొబైల్ సేవలు ఇవాల్టి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే కేవలం పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు మాత్రమే ఈ సౌకర్యాన్ని పునరుద్దరించారు. ఆ రాష్ట్రంలోని అన్ని నెట్‌వర్క్‌లు పోస్ట్‌పెయిడ్ నెంబర్లకు సెల్ సిగ్నల్స్ అందుబాటులోకి తెచ్చాయి. కాగా, మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌పై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పాటు 20 లక్షల ప్రీపెయిడ్ వినియోగదారులకు సేవలు ఇంకా పునరుద్దరించలేదు. కేవలం 40 లక్షల పోస్ట్‌పెయిడ్ నంబర్లకు మాత్రం వాయిస్ కాల్స్ […]

Advertisement
Update:2019-10-14 09:22 IST

జమ్ము కశ్మీర్‌లో రెండున్నర నెలల తర్వాత మొబైల్ సేవలు ఇవాల్టి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే కేవలం పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు మాత్రమే ఈ సౌకర్యాన్ని పునరుద్దరించారు. ఆ రాష్ట్రంలోని అన్ని నెట్‌వర్క్‌లు పోస్ట్‌పెయిడ్ నెంబర్లకు సెల్ సిగ్నల్స్ అందుబాటులోకి తెచ్చాయి.

కాగా, మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌పై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పాటు 20 లక్షల ప్రీపెయిడ్ వినియోగదారులకు సేవలు ఇంకా పునరుద్దరించలేదు. కేవలం 40 లక్షల పోస్ట్‌పెయిడ్ నంబర్లకు మాత్రం వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం కల్పించారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆందోళనలు తీవ్రతరం కాకుండా, వదంతులు వ్యాప్తి చెందకుండా అగస్టు 5 నుంచి మొబైల్, ఇంటర్నెట్ సేవలను కశ్మీర్లో నిషేధించారు. అయితే గత కొన్ని రోజులుగా పరిస్థితులు సద్దుమణుగుతుండటంతో ఆంక్షలను సడలిస్తూ వచ్చారు. ఇప్పటికే ల్యాండ్‌లైన్ సేవలను పునరుద్దరించిన ప్రభుత్వం తాజాగా మొబైల్ పోస్ట్‌పెయిడ్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది.

Tags:    
Advertisement

Similar News