భారత్ తయారుచేసిన అత్యాధునిక జలాంతర్గామి.... నావికాదళానికి

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం ముంబైలో ఐఎన్ఎస్ ఖండేరిని ప్రారంభించారు. ఇది భారత నావికాదళంలో జలాంతర్గామి విభాగం లో చేరిన రెండవ స్కార్పీన్-క్లాస్ జలాంతర్గామి. ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ… “ఐఎన్ఎస్ ఖండేరిని ప్రారంభించడానికి ఇక్కడ నిలబడటం నాకు గర్వంగా ఉంది. దీనిని ప్రాజెక్ట్ 75 కింద భారతదేశంలో నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ఫ్రాన్స్‌ భాగస్వ్వామ్యం తో చేపట్టినది కావడంతో ఇది ఫ్రాన్స్‌తో మన ప్రత్యేక సంబంధాలకు చిహ్నం గా నిలిచింది. నావికాదళాన్ని చూసి […]

Advertisement
Update:2019-09-28 11:18 IST

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం ముంబైలో ఐఎన్ఎస్ ఖండేరిని ప్రారంభించారు. ఇది భారత నావికాదళంలో జలాంతర్గామి విభాగం లో చేరిన రెండవ స్కార్పీన్-క్లాస్ జలాంతర్గామి.

ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ… “ఐఎన్ఎస్ ఖండేరిని ప్రారంభించడానికి ఇక్కడ నిలబడటం నాకు గర్వంగా ఉంది. దీనిని ప్రాజెక్ట్ 75 కింద భారతదేశంలో నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ఫ్రాన్స్‌ భాగస్వ్వామ్యం తో చేపట్టినది కావడంతో ఇది ఫ్రాన్స్‌తో మన ప్రత్యేక సంబంధాలకు చిహ్నం గా నిలిచింది. నావికాదళాన్ని చూసి మేము గర్విస్తున్నాం. 1971 లో పాకిస్తాన్‌ను ఓడించడంలో నౌకాదళం భారీ పాత్ర పోషించింది. పాకిస్తాన్ మా సామర్థ్యాలను తెలుసుకోవాలి. అవసరమైతే మేం వాటిని ఉపయోగించవచ్చ”న్నారు.

నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ మాట్లాడుతూ… “ఖండేరిని ఆరంభించడం భారత నావికాదళం పోరాట సామర్థ్యాలలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఇది సంక్లిష్టమైన వేదికలపై నిర్మించగల మా సామర్థ్యాలకు నిదర్శనం. ఈ రోజు మీ ముందు ఉన్న ఈ ప్లాట్ ఫాం భారత నావికాదళానికి ఉన్న సాంకేతికతను స్థానికీకరించే సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తున్నద”ని అన్నారు.

ఆయుధాలు, సెన్సార్ల తాజా సాంకేతిక పరిజ్ఞానం… టెక్నాలజీతో కూడిన ఆధునిక జలాంతర్గామి ఇది.

ఎండిఎల్ యార్డ్ 11876 గా పేరుపెట్టిన కొత్త ఖండేరి నిర్మాణం ఏప్రిల్ 2009 లో ప్రారంభమైంది.

స్కార్పీన్ ప్రపంచంలో అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన సాంప్రదాయ జలాంతర్గాములలో ఒకటి ఇది. అంతేకాదు భారతదేశంలో దీనిని కల్వరి క్లాస్ జలాంతర్గామిగా వ్యవహరిస్తారు.

ఐఎన్ఎస్ ఖండేరి ని అరేబియా సముద్రంలో దొరికే “కన్నేరి” చేపలను చూసి ప్రేరణ పొంది రూపొందించారు. ఈ చేప వేటాడటం లో ప్రత్యేక సామర్థ్య్హాన్ని కలిగి ఉంది. సముద్రం దిగువన ఈదుతూ బార్బెల్స్ ఉపయోగించి తమ ఆహారమైన సముద్రజీవులను కనుగొని, వాటిని చంపడానికి, ముక్కలు చేయడానికి పొడవైన రంపం లాంటి అవయవాన్ని ఉపయోగిస్తుంది. ఇలా ముక్కలు ముక్కలుగా తరిగిన ఆహారాన్ని మాత్రమే తింటుంది.

భారతదేశంలో ఆరు స్కార్పీన్-క్లాస్ జలాంతర్గాములను నిర్మించే ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యింది. ఇప్పటికి ఆరు జలాంతర్గాములలో రెండింటిని మాత్రమే నౌకా దళానికి అందించారు. మజ్గావ్ డాక్స్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌ లో మిగతా నాలుగు నిర్మాణ దశలో ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News