ఏడాదిన్నరలో 1,35,000 వీడియోలు డిలీట్ చేసిన టిక్‌టాక్

ప్రముఖ షార్ట్ వీడియో సోషల్ మీడియా యాప్ ‘టిక్‌టాక్’ ఏడాదిన్నరలో దాదాపు 1,35,000 వీడియోలను తమ ప్లాట్‌ఫామ్ నుంచి డిలీట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ఇండియాలో తమ సేవలు అందుబాటులోనికి వచ్చిన కాలం నుంచి ఈ ఏడాది జూన్ చివరి నాటికి వచ్చిన వీడియోల్లో అభ్యంతరకరమైన వాటిని తొలగించినట్లు టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ స్పష్టం చేసింది. 2017 జనవరి నుంచి 2019 జూన్ వరకు టిక్‌టాక్‌లోని కంటెంట్ విషయంలో పలు న్యాయ సంస్థలు, వినియోగదారుల […]

Advertisement
Update:2019-09-19 06:44 IST

ప్రముఖ షార్ట్ వీడియో సోషల్ మీడియా యాప్ ‘టిక్‌టాక్’ ఏడాదిన్నరలో దాదాపు 1,35,000 వీడియోలను తమ ప్లాట్‌ఫామ్ నుంచి డిలీట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ఇండియాలో తమ సేవలు అందుబాటులోనికి వచ్చిన కాలం నుంచి ఈ ఏడాది జూన్ చివరి నాటికి వచ్చిన వీడియోల్లో అభ్యంతరకరమైన వాటిని తొలగించినట్లు టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ స్పష్టం చేసింది.

2017 జనవరి నుంచి 2019 జూన్ వరకు టిక్‌టాక్‌లోని కంటెంట్ విషయంలో పలు న్యాయ సంస్థలు, వినియోగదారుల నుంచి 1.7 మిలియన్ల పిర్యాదులు అందాయని.. దాంతో 1,34,844 వీడియోలు తొలిగించామని కేంద్రం అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పింది. తమ యాప్‌లోని 7,00,257 అకౌంట్లపై పిర్యాదులు అందగా.. 1,81,926 అకౌంట్లను శాశ్వతంగా నిషేధించామని స్పష్టం చేసింది.

ప్రస్తుతం టిక్‌టాక్‌కు 20 కోట్ల మంది వినియోగదారులతో ఇండియా అతి పెద్ద మార్కెట్‌గా ఉండగా తర్వాతి స్థానంలో అమెరికా ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు చెందిన స్వదేశీ జాగరణ్ మంచ్ ‘టిక్‌టాక్’ మరియు దాని సబ్సిడరీ సంస్థ ‘హలో’ యాప్‌లపై ప్రధాని నరేంద్ర మోడీకి పిర్యాదు చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంలో భాగమైన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జులైలో 24 ప్రశ్నలతో కూడిన నోటీసు పంపించింది. వీటికి సరైన సమాధానాలు పంపకపోతే ఈ రెండు యాప్స్ ఇండియాలో బ్యాన్ చేస్తామని కూడా హెచ్చరించింది.

ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ప్రచురించే పారదర్శక నివేదికలు (ట్రాన్స్‌పరెన్సీ రిపోర్ట్స్) తమ సంస్థ ప్రచురించడం లేదని.. కాని భవిష్యత్‌లో తప్పకుండా ప్రచురిస్తామని.. దానికి సంబంధించిన ప్రక్రియ జరుగుతోందని టిక్ టాక్ వివరించింది. ఇక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజన్సీలు (కోర్టులు, పోలీసు, ఐబీ, రా వంటివి) సాధారణంగా యూజర్లకు సంబంధించిన రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, టిక్‌టాక్‌తో జత చేసిన ఇతర సోషల్ మీడియా అకౌంట్ల వివరాలతో పాటు ఐపీ అడ్రస్‌లను అడుగుతుంటాయని.. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 127 విజ్ఞప్తులు వచ్చాయని పేర్కొంది.

ఇలాంటి విజ్ఞప్తులను 3 గంటల్లో స్పందిస్తామని.. మా సరి కొత్త టెక్నాలజీ కేవలం 15 నిమిషాల్లోనే తమ మొదటి స్పందన తెలుపుతుందని పేర్కొంది.

హలో యాప్‌ పిర్యాదులపై..

హలో యాప్‌కు సంబంధించిన పిర్యాదుల గురించి కూడా ఐటీ మంత్రిత్వ శాఖ పలు ప్రశ్నలు అడిగింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో హలో యాప్ 11 వేల మార్ఫింగ్ పొలిటికల్ వీడియోలను ఇతర సోషల్ మీడియా యాప్స్‌లోకి అప్‌లోడ్ చేసింది. దీనిపై కేంద్రం సీరియస్ అవగా బైట్‌డ్యాన్స్ సమాధానం ఇచ్చింది.

ఈ రాజకీయ వార్తల ఆర్టికల్స్ తాము రూపొందించలేదని.. మా హలో యూజర్లు వాటిని తమ ఖాతాల్లోకి అప్‌లోడ్ చేశారని తెలిపింది. వాటిని మా హలో ఆటోమేటెడ్ టూల్ పలు సోషల్ మీడియా ఖాతాల్లోకి పంపిందని స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News