ఇస్రోతో పాటు నాసా.... విక్రమ్ కోసం రంగంలోకి....

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో సిగ్నల్స్ కట్ అయిపోయి సంబంధాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఇస్రో దీనితో అనుసంధానానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా మన విక్రమ్ ల్యాండర్ కోసం చంద్రుడిపై ఇదివరకే పంపిన తన ‘లూనార్ ఆర్బిటర్’ను రంగంలోకి దింపింది. లూనార్ ఈనెల 17న దక్షిణ ధృవంపై దిగిన విక్రమ్ జాడలను ఫొటోలు తీసి పంపుతుందట. మన విక్రమ్ […]

Advertisement
Update:2019-09-13 06:45 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో సిగ్నల్స్ కట్ అయిపోయి సంబంధాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఇస్రో దీనితో అనుసంధానానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా మన విక్రమ్ ల్యాండర్ కోసం చంద్రుడిపై ఇదివరకే పంపిన తన ‘లూనార్ ఆర్బిటర్’ను రంగంలోకి దింపింది. లూనార్ ఈనెల 17న దక్షిణ ధృవంపై దిగిన విక్రమ్ జాడలను ఫొటోలు తీసి పంపుతుందట.

మన విక్రమ్ ల్యాండర్ కోసం అమెరికా నాసా వెతకడానికి కారణముంది. మన విక్రమ్ ల్యాండర్ లోనే నాసా ‘లేజర్ రెట్రోరిఫ్లైక్టర్ యారే’ అనే పరికరాన్ని పంపింది. ఇది అక్కడ మనుషులు దిగడానికి, నివసించడానికి ఆస్కారం ఉందా అనేది తేలుస్తుందట.

2024లో చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి వ్యోమగాములను పంపాలని నాసా భావిస్తోంది. ఇందుకోసం మన విక్రమ్ ల్యాండర్ లో ఈ లేజర్ పరికరాన్ని పెట్టింది. అక్కడ పరిస్థితులను ఈ లేజర్ తెసుకొని నాసాకు చేరవేస్తుంది. ఇప్పుడు విక్రమ్ తో సంబంధాలు తెగిపోవడంతో నాసా కూడా రంగంలోకి దిగి దాంతో సంబంధాలు పునరుద్ధరించేందుకు కృషి చేస్తోంది.

తాజాగా విక్రమ్ తో కనెక్టివిటీ కోసం నాసా తన అత్యున్నత ల్యాబ్ అయిన జెట్ ప్రొపల్షన్ ల్యాబ్, డీప్ స్పేస్ నెట్ వర్క్ సెంటర్ల ద్వారా రేడియో సంకేతాలు పంపుతోంది.

అయితే ఈనెల 21వరకే విక్రమ్ తో నాసా, ఇస్రో కనెక్ట్ కాగలదు. ఆ తర్వాత చంద్రుడి దక్షిణ దృవం 14 రోజుల పాటు చీకట్లోకి వెళ్లిపోతుంది. మన భూమిపై ఒక రోజుకు 24 గంటలు.. కానీ చంద్రుడిపై 14 రోజులైతే ఒక రోజు. పగలు 14 రోజులు… 21వ తేదీకి ముగుస్తుంది. సో ఆలోపే విక్రమ్ తో కనెక్టివిటీకి ఇస్రో, నాసా ప్రయత్నాలు చేస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News