బాబుకు, జగన్ కు తేడా చెప్పిన విజయసాయిరెడ్డి
సందర్భానుసారం ప్రతిపక్ష టీడీపీని, ఆ పార్టీ అధినేతను ఉతికి ఆరేసే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఆడిపోసుకుంటున్న చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తాజాగా ట్విట్టర్ లో ఆయన ఆర్టీసీ విలీనం గురించి ట్వీట్ చేస్తూ జగన్ కు, చంద్రబాబుకు ఉన్న తేడాను విప్పి చెప్పారు. చంద్రబాబు నైజాన్ని కడిగిపారేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని మూసివేసి ప్రైవేటీకరించే కుట్ర చేస్తే అధికారం చేపట్టగానే జగన్ మాత్రం వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చేసి ఆర్టీసికి ప్రాణం […]
సందర్భానుసారం ప్రతిపక్ష టీడీపీని, ఆ పార్టీ అధినేతను ఉతికి ఆరేసే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఆడిపోసుకుంటున్న చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తాజాగా ట్విట్టర్ లో ఆయన ఆర్టీసీ విలీనం గురించి ట్వీట్ చేస్తూ జగన్ కు, చంద్రబాబుకు ఉన్న తేడాను విప్పి చెప్పారు. చంద్రబాబు నైజాన్ని కడిగిపారేశారు.
చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని మూసివేసి ప్రైవేటీకరించే కుట్ర చేస్తే అధికారం చేపట్టగానే జగన్ మాత్రం వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చేసి ఆర్టీసికి ప్రాణం పోశారని విజయసాయిరెడ్డి కీర్తించారు. ఆర్టీసీ కార్మికుల కష్టాలు జగన్ కు తెలుసునన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడని కొనియాడారు. చంద్రబాబు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు.
జగన్ ఆర్టీసీని విలీనం చేస్తే కక్కలేక మింగలేక చంద్రబాబు తంటాలు పడుతున్నాడని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. హెరిటేజ్ కోసం ఏపీ డెయిరీని నాశనం చేసిన చరిత్ర చంద్రబాబుది అని ధ్వజమెత్తారు. సొంత మనుషులు, కుటుంబం కోసమే 40ఏళ్లుగా కష్టపడ్డ చరిత్ర బాబుదని కడిగిపారేశారు.
ఆర్టీసీని నాశనం చేసి ప్రైవేటు ఆపరేటర్ల కోసం ఆర్టీసీని కొల్లగొట్టిన చరిత్ర చంద్రబాబుది అని మండిపడ్డారు. విలువైన భూములను తన వాళ్లకు మల్టీప్లెక్స్ నిర్మాణాలకు లీజుకిచ్చారని దుయ్యబట్టారు.