చంద్రబాబు మతకోణంపై ఎమ్మెల్యే శ్రీదేవి సవాల్

ఇటీవల గణేష్ మండపం వద్దకు వెళ్లిన వైసీపీ దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని తుళ్లూరు మండలంలో టీడీపీ కార్యకర్తలు బూతులు తిట్టి, కులం పేరుతో దూషించిన అంశంపై చంద్రబాబు స్పందించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఒక మహిళా ఎమ్మెల్యేను బూతులు తిట్టిన సంఘటనను ఖండించని చంద్రబాబు… పైగా ఎదురుదాడి మొదలుపెట్టారు. ట్విట్టర్ వేదికగా అసలు ఉండవల్లి శ్రీదేవి దళితురాలే కాదని… ఆమె ఒక క్రిస్టియన్ అని ఆరోపించారు. శ్రీదేవి భర్త ఒక కాపు అని ఆరోపించారు. క్రిస్టియన్‌ […]

Advertisement
Update:2019-09-06 11:37 IST

ఇటీవల గణేష్ మండపం వద్దకు వెళ్లిన వైసీపీ దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని తుళ్లూరు మండలంలో టీడీపీ కార్యకర్తలు బూతులు తిట్టి, కులం పేరుతో దూషించిన అంశంపై చంద్రబాబు స్పందించిన తీరు విమర్శలకు తావిస్తోంది.

ఒక మహిళా ఎమ్మెల్యేను బూతులు తిట్టిన సంఘటనను ఖండించని చంద్రబాబు… పైగా ఎదురుదాడి మొదలుపెట్టారు. ట్విట్టర్ వేదికగా అసలు ఉండవల్లి శ్రీదేవి దళితురాలే కాదని… ఆమె ఒక క్రిస్టియన్ అని ఆరోపించారు. శ్రీదేవి భర్త ఒక కాపు అని ఆరోపించారు. క్రిస్టియన్‌ అయిన శ్రీదేవి ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడుతారని ప్రశ్నించారు. కావాలనే కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఇందుకు శ్రీదేవి స్పందించారు. చంద్రబాబుకు సవాల్ విసిరారు. తాను హిందూ దళిత మహిళనని ఆ విషయాన్ని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

చంద్రబాబుకు దమ్ముధైర్యం ఉంటే తాను దళిత మహిళను కాదన్న విషయాన్ని ఆధారాలు చూపించి నిరూపించాలని ఆమె సవాల్ చేశారు.

చంద్రబాబు దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారనడానికి ఆయన చేస్తున్న విమర్శలే నిదర్శనమన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం వెన్నుపోట్లు, చిల్లర రాజకీయాలతోనే సాగిందని ఆమె ఫైర్ అయ్యారు.

Tags:    
Advertisement

Similar News