కేటీఆర్ వ్యాఖ్యలు.. ఈటెలను ఉద్దేశించేనా..?
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది నేతలు పదవులు రాగానే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీ వల్లే వారు ఇవాళ పదవుల్లో ఉన్నారని.. ప్రజలే తమకు బాసులనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. పార్టీ కంటే ఎవరూ పెద్ద వాళ్లు కాదనే విషయం వారు అర్థం చేసుకోవాలని కేటీఆర్ అన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలు మంత్రి ఈటెల రాజేందర్‌ను ఉద్దేశించే చేసినట్లు […]
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది నేతలు పదవులు రాగానే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ వల్లే వారు ఇవాళ పదవుల్లో ఉన్నారని.. ప్రజలే తమకు బాసులనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. పార్టీ కంటే ఎవరూ పెద్ద వాళ్లు కాదనే విషయం వారు అర్థం చేసుకోవాలని కేటీఆర్ అన్నారు.
కాగా, ఈ వ్యాఖ్యలు మంత్రి ఈటెల రాజేందర్‌ను ఉద్దేశించే చేసినట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో మంత్రి ఈటెల మాట్లాడుతూ… గులాబీ జెండాకు తాము కూడా ఓనర్లమేనని వ్యాఖ్యానించారు. తనకు పదవి ఎవరి దయ, బిక్ష వల్ల రాలేదని.. ప్రజల అండతోనే మంత్రినయ్యానని చెప్పుకొచ్చారు.
ఈటెల వ్యాఖ్యలను మనసులో పెట్టుకునే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో ఈటెల వ్యాఖ్యలు భవిష్యత్‌లో ఆయనకు మైనస్‌గా మారే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు సీనియర్ నాయకులు ఇలా పార్టీ అధినేతను చిన్నబుచ్చేలా మాట్లాడటాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.