తహసీల్దార్‌ లావణ్య భర్తదీ అదే దారి... అరెస్ట్

కేశంపేట తహసీల్దార్ లావణ్య వ్యవహారం ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రైతులను, పేదలను జలగలాగా పట్టిపీడించిన లావణ్య జులైలో ఏసీబీకి దొరికిపోయింది. ఆమె ఇంట్లో తనిఖీలు నిర్వహించగా భారీగా బంగారం, నగదు బయటపడింది. ఇంట్లోనే 93 లక్షలు దొరికింది. ఆమె అరెస్ట్‌ తర్వాత బాధితులంతా పెద్ద ధర్నా కూడా నిర్వహించారు. లావణ్య కాదు ఆమె భర్తది అదే పంథా అని తేలిపోయింది. రెండు నెలలు తిరగకుండానే లావణ్య భర్త వెంకటేశ్వర నాయక్‌ కూడా ఏసీబీకి పట్టుపడ్డాడు. […]

Advertisement
Update:2019-09-01 03:25 IST

కేశంపేట తహసీల్దార్ లావణ్య వ్యవహారం ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రైతులను, పేదలను జలగలాగా పట్టిపీడించిన లావణ్య జులైలో ఏసీబీకి దొరికిపోయింది. ఆమె ఇంట్లో తనిఖీలు నిర్వహించగా భారీగా బంగారం, నగదు బయటపడింది. ఇంట్లోనే 93 లక్షలు దొరికింది. ఆమె అరెస్ట్‌ తర్వాత బాధితులంతా పెద్ద ధర్నా కూడా నిర్వహించారు.

లావణ్య కాదు ఆమె భర్తది అదే పంథా అని తేలిపోయింది. రెండు నెలలు తిరగకుండానే లావణ్య భర్త వెంకటేశ్వర నాయక్‌ కూడా ఏసీబీకి పట్టుపడ్డాడు. భార్య ఏసీబీకి దొరికిపోయిన తర్వాత కూడా ఏమాత్రం మారని వెంకటేశ్వర నాయక్… హైదరాబాద్‌ మాసాబ్‌ ట్యాంక్‌లోని మున్సిపల్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రణధీర్ అనే వ్యక్తి నుంచి రెండున్నర లక్షలు లంచం తీసుకున్నాడు. అనంతరం నకిలీ నియామక పత్రాన్ని ఇచ్చాడు.

కార్యాలయంలో అప్పటి వరకు పనిచేస్తున్న ఒక మహిళ ప్రసూతి సెలవుపై వెళ్లడంతో ఆమె పనిని రణధీర్‌ ద్వారా చేయించి ఒక నెల జీతం అతడి ఖాతాలో వేయించాడు. సదరు మహిళ తిరిగి విధుల్లోకి రాగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో తన నియామకంపై ఉన్నతాధికారులను సంప్రదించగా అది నకిలీ పత్రమని తేలింది. దాంతో రణధీర్‌ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సాక్ష్యాలు ఉండడంతో వెంకటేశ్వర నాయక్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

Tags:    
Advertisement

Similar News