బాలకృష్ణ అల్లుడికి భూమి ఇచ్చింది బాబే... భరత్ పచ్చి బుకాయింపు...
అమరావతి ప్రాంతంలో చంద్రబాబు, ఆయన బంధువులు, టీడీపీ నేతలు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్టు పచ్చిగా రుజువవుతోంది. బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కుటుంబానికి కేటాయించిన 498 ఎకరాలకు సంబంధించిన లావాదేవీలు కూడా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో భాగంగానే జరిగినట్టు తేలింది. జగ్గయ్యపేట మండలం జయంతిపురం వద్ద బాలకృష్ణ చిన్నల్లుడుకి చెందిన వీఎఫ్‌సీఎల్ ఫెర్టిలైజర్ కంపెనీకి 498 ఎకరాలు కేటాయించింది చంద్రబాబేనని తేలింది. ఈ భూమిని తమకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కేటాయించారంటూ శ్రీభరత్ మీడియా […]
అమరావతి ప్రాంతంలో చంద్రబాబు, ఆయన బంధువులు, టీడీపీ నేతలు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్టు పచ్చిగా రుజువవుతోంది. బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కుటుంబానికి కేటాయించిన 498 ఎకరాలకు సంబంధించిన లావాదేవీలు కూడా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో భాగంగానే జరిగినట్టు తేలింది.
జగ్గయ్యపేట మండలం జయంతిపురం వద్ద బాలకృష్ణ చిన్నల్లుడుకి చెందిన వీఎఫ్‌సీఎల్ ఫెర్టిలైజర్ కంపెనీకి 498 ఎకరాలు కేటాయించింది చంద్రబాబేనని తేలింది.
ఈ భూమిని తమకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కేటాయించారంటూ శ్రీభరత్ మీడియా ముందు చెప్పారు. కానీ అది పచ్చి అబద్దమని తేలింది. భూకేటాయింపులకు సంబంధించిన జీవోలను సీఆర్‌డీఏ అధికారులు బయటపెట్టారు.
ఈ 498 ఎకరాలను చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 2015 జులై 15న భరత్ కంపెనీకి కేటాయించారు. ఆ తర్వాత రెండు నెలలకే ఆ భూమిని సీఆర్‌డీఏ పరిధిలోకి తెచ్చారు.
తమకు కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వమే కేటాయించిందని శ్రీభరత్ మీడియా ముందు చెప్పిన నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ జీవో కాపీలను మీడియా ముందు చూపించారు.