ప్రపంచ టైటిల్ అమ్మకే అంకితం

గాల్లో తేలిపోతున్న విశ్వవిజేత సింధు స్విట్జర్లాండ్ వేదికగా ముగిసిన 2019 ప్రపంచ బ్యాడ్మింటన్ టైటిల్ ను తన తల్లి విజయకు అంకితమిస్తున్నట్లు విశ్వవిజేత పీవీ సింధు ప్రకటించింది. అమ్మ పుట్టినరోజునాడే తాను ప్రపంచ బ్యాడ్మింటన్ బంగారు పతకం అందుకోడం ఓ మధురానుభవమని విజయానంతరం సింధు చెప్పింది. గత 11 సంవత్సరాలుగా తాను అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో సాధిస్తూ వచ్చిన విజయాల వెనుక అమ్మ విజయ ప్రోత్సాహం, త్యాగం, అండదండలు ఎంతగానో ఉన్నాయని సింధు గుర్తు చేసుకొంది. ప్రపంచకప్ బ్యాడ్మింటన్ టోర్నీలలో […]

Advertisement
Update:2019-08-27 05:40 IST
  • గాల్లో తేలిపోతున్న విశ్వవిజేత సింధు

స్విట్జర్లాండ్ వేదికగా ముగిసిన 2019 ప్రపంచ బ్యాడ్మింటన్ టైటిల్ ను తన తల్లి విజయకు అంకితమిస్తున్నట్లు విశ్వవిజేత పీవీ సింధు ప్రకటించింది.

అమ్మ పుట్టినరోజునాడే తాను ప్రపంచ బ్యాడ్మింటన్ బంగారు పతకం అందుకోడం ఓ మధురానుభవమని విజయానంతరం సింధు చెప్పింది.

గత 11 సంవత్సరాలుగా తాను అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో సాధిస్తూ వచ్చిన విజయాల వెనుక అమ్మ విజయ ప్రోత్సాహం, త్యాగం, అండదండలు ఎంతగానో ఉన్నాయని సింధు గుర్తు చేసుకొంది.

ప్రపంచకప్ బ్యాడ్మింటన్ టోర్నీలలో ఇప్పటివరకూ రెండు రజత, రెండు కాంస్య పతకాలు సాధించిన సింధు తొలిసారిగా బంగారు పతకం అందుకోగలిగింది.

రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన సింధు…ఇక…వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించాల్సి ఉంది.

24 ఏళ్ల వయసుకే ఐదు ప్రపంచకప్, ఒలింపిక్స్, ఆసియాక్రీడల రజత పతకాలు సాధించిన సింధు.. ఆల్- ఇంగ్లండ్ టైటిల్ సైతం గెలుచుకోవాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News