కోడెల వాదన కోర్టు అంగీకరిస్తుందా?

ఒక వ్యక్తి ఒక ఇంట్లోకి చొరబడి బంగారం ఎత్తుకెళ్లాడు. తొలుత దాన్ని ఎవరూ కనుక్కోలేకపోయారు. కానీ పలాన వ్యక్తే బంగారం ఎత్తుకెళ్లాడని తెలియగానే… అవును వారింటిలో బంగారం తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకున్నా… ఇది దొంగతనం కాదు… బంగారం తిరిగి ఇచ్చేస్తా అంటే చట్టం ఒప్పుకుంటుందా?. దొంగతనం బయటపడిన తర్వాత దొంగే స్వచ్చందంగా ముందుకొచ్చి సొత్తు అప్పగించారని చెప్పడానికి వీలుంటుందా?. అలాంటి అవకాశమే లేదు. దొంగతనం చేసినట్టు అంగీకరించినందుకు శిక్ష కొద్దిమేర తగ్గవచ్చు గానీ… అసలు అది […]

Advertisement
Update:2019-08-27 02:09 IST

ఒక వ్యక్తి ఒక ఇంట్లోకి చొరబడి బంగారం ఎత్తుకెళ్లాడు. తొలుత దాన్ని ఎవరూ కనుక్కోలేకపోయారు. కానీ పలాన వ్యక్తే బంగారం ఎత్తుకెళ్లాడని తెలియగానే… అవును వారింటిలో బంగారం తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకున్నా… ఇది దొంగతనం కాదు… బంగారం తిరిగి ఇచ్చేస్తా అంటే చట్టం ఒప్పుకుంటుందా?. దొంగతనం బయటపడిన తర్వాత దొంగే స్వచ్చందంగా ముందుకొచ్చి సొత్తు అప్పగించారని చెప్పడానికి వీలుంటుందా?. అలాంటి అవకాశమే లేదు.

దొంగతనం చేసినట్టు అంగీకరించినందుకు శిక్ష కొద్దిమేర తగ్గవచ్చు గానీ… అసలు అది నేరమే కాదంటే… ఇక దేశంలో దొంగలకు ప్రత్యేక హక్కులు, రక్షణలు కల్పించినట్టే అవుతుంది.

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాత్రం ఇదే తరహా మినహాయింపు అడుగుతున్నాడు. యూరోపియన్ దేశాల నుంచి దిగువతి చేసుకున్న కోటికి పైగా విలువైన ఫర్నిచర్‌ను దారి మళ్లించి, తన క్యాంపు కార్యాలయంతో పాటు కుమారుడి షోరూంలోనూ సోకులు చేసుకున్నారు.

ఈ వ్యవహారం బయటకు రావడం, ఫర్నిచర్‌ కూడా దొరికిపోవడంతో కోడెలపై కేసు నమోదు అయింది. అయితే ఆయన హైకోర్టుకు వెళ్లారు. ఫర్నిచర్‌, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తిరిగి ఇచ్చేస్తానని… వాటిని తీసుకెళ్లాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

నిజానికే ఇప్పటికే ప్రభుత్వం ఫర్నిచర్‌ను స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఈయన హైకోర్టుకు వెళ్లడం వెనుక ఉద్దేశం… సొత్తు వెనక్కు ఇచ్చేశా… కాబట్టి తనను నేరస్తుడిగా చూడవద్దు అన్నది. కోర్టు మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతుంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News