ఈటల టార్గెట్‌గా రాజకీయం... అసలు కథేంటి?
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ టార్గెట్‌గా రాజకీయం నడుస్తుందా? గులాబీదళంలో ఓ వర్గం ఆయన మీద ఎక్కుపెట్టిందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఈటలను తప్పిస్తారని ఈవర్గం ప్రచారం మొదలుపెట్టింది. ఊరు పేరు లేని, అంతగా సర్క్యులేషన్‌లో లేని ఓ దినపత్రికలో కూడా వార్తలు వండివారుస్తున్నారు. ఇంతకీ ఈటలను టార్గెట్ చేయడానికి కారణాలేంటి? ఇటీవల కలెక్టర్ల సమావేశం జరిగింది. రెవెన్యూ చట్టంలో తీసుకురావాల్సిన మార్పులపై కలెక్టర్లతో సీఎం కేసీఆర్ చర్చించారు. […]
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ టార్గెట్‌గా రాజకీయం నడుస్తుందా? గులాబీదళంలో ఓ వర్గం ఆయన మీద ఎక్కుపెట్టిందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి.
రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఈటలను తప్పిస్తారని ఈవర్గం ప్రచారం మొదలుపెట్టింది. ఊరు పేరు లేని, అంతగా సర్క్యులేషన్‌లో లేని ఓ దినపత్రికలో కూడా వార్తలు వండివారుస్తున్నారు. ఇంతకీ ఈటలను టార్గెట్ చేయడానికి కారణాలేంటి?
ఇటీవల కలెక్టర్ల సమావేశం జరిగింది. రెవెన్యూ చట్టంలో తీసుకురావాల్సిన మార్పులపై కలెక్టర్లతో సీఎం కేసీఆర్ చర్చించారు. సీరియస్ డిస్కషన్ సాగింది. తన ఆలోచనలను కలెక్టర్ల తో కేసీఆర్ పంచుకున్నారు. కలెక్టర్లు చెప్పిన సలహాలు విన్నారు.
అయితే ఈ మీటింగ్ తర్వాత మంత్రి ఈటల రాజేందర్‌ను రెవెన్యూ సంఘాల కీలక నేతలు కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ల మీటింగ్ లో జరిగిన చర్చను వారికి ఈటల చెప్పారనేది ఆరోపణ. సీఎం ప్లాన్‌లు విన్న రెవెన్యూ సంఘాల నేతలు ఇప్పుడు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారనేది మరో విషయం.
అయితే ఈటల లీకుల మీద సీఎంకు ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన సీరియస్ అయ్యారని…లీకుల మీద చర్యలు ఉంటాయని గులాబీలోని ఓవర్గం అంటోంది.
అయితే మొదటి నుంచి ఈటలకు ఉద్యోగ సంఘాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. కొన్ని అంశాల్లో హరీష్‌రావుతో కలిసి ట్రబుల్ షూటర్ పాత్ర పోషించారు. బీసీ నేతగా ఉన్న ఆయన ఇమేజ్ కు డ్యామేజ్ కొట్టడమే తాజా ఎత్తుగడగా తెలుస్తోంది.