ఏపీ రాజధానిపై జగన్‌ సంచలన ఆలోచన... బయటపెట్టిన ఎంపీ

అమరావతి ముంపుకు గురవుతున్న నేపథ్యంలో రాజధానిని మారుస్తారన్న అంశంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీజీ చెప్పినట్టే జరిగితే టీడీపీకి పెద్ద షాకే. జగన్ అభివృద్ధిని ఒకే చోట కాకుండా… రాష్ట్రంలో నాలుగు రాజధానులను ఏర్పాటు చేయబోతున్నారని టీజీ చెప్పారు.  అమరావతి ఇక రాజధానిగా కొనసాగే అవకాశం లేదని ఆయన స్పష్టం చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమ న్యాయం చేసేలా… జగన్ ఏపీలో నాలుగు కేంద్రాలను […]

Advertisement
Update:2019-08-25 13:13 IST

అమరావతి ముంపుకు గురవుతున్న నేపథ్యంలో రాజధానిని మారుస్తారన్న అంశంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీజీ చెప్పినట్టే జరిగితే టీడీపీకి పెద్ద షాకే. జగన్ అభివృద్ధిని ఒకే చోట కాకుండా… రాష్ట్రంలో నాలుగు రాజధానులను ఏర్పాటు చేయబోతున్నారని టీజీ చెప్పారు. అమరావతి ఇక రాజధానిగా కొనసాగే అవకాశం లేదని ఆయన స్పష్టం చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమ న్యాయం చేసేలా… జగన్ ఏపీలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారని టీజీ వెల్లడించారు.

ఒకే చోట కాకుండా నాలుగు కేంద్రాలుగా అభివృద్ధి చేసే ఆలోచనను ఇది వరకే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు జగన్‌ వివరించారని కూడా టీజీ వెల్లడించారు.

ఈ విషయాన్ని బీజేపీ పెద్దలే స్వయంగా తన సమక్షంలోనే చెప్పారని టీజీ వివరించారు. కాబట్టి అమరావతి ఇక రాజధానిగా కొనసాగే అవకాశం లేదన్నారు.

విజయనగరం కేంద్రంగా ఉత్తరాంధ్ర ప్రాంతీయ ప్రణాళిక బోర్డు, గుంటూరు కేంద్రంగా ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు ఒక ప్రాంతీయ బోర్డును… రాయలసీమ నాలుగు జిల్లాలకు ఒక ప్రాంతీయ బోర్డును… కాకినాడ కేంద్రంగా కృష్ణా, గోదావరి జిల్లాలకు కలిపి ఒక ప్రాంతీయ బోర్టును ఇటీవల జగన్‌ ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని టీజీ గుర్తు చేశారు.

ఈ ప్రాంతీయ బోర్డులు పనిచేసే నాలుగు కేంద్రాల్లో రాజధాని తరహా అభివృద్ధిని జగన్‌ చేయబోతున్నారని వివరించారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారో అక్కడ అది సూపర్ క్యాపిటల్‌గా ఉంటుందని వివరించారు.

ఏపీలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా నాలుగు కేంద్రాల్లో రాజధానులు ఉంటాయన్నది ఖాయమని… దాన్ని రాసిపెట్టుకోండి అని కూడా టీజీ చెప్పారు. రాజధాని ప్రాంతాలో నారా లోకేష్‌ను ప్రజలు ఓడించిన అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

ఒకవేళ టీజీ చెప్పినట్టుగానే…. జగన్‌ చేస్తే దీన్ని స్వాగతించాల్సిందే. అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకరించడం వల్ల మిగిలిన ప్రాంతాలు అభివృద్ధికి దూరమవుతున్నాయి.

భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చినప్పుడు రాజధాని ప్రాంతాల వారు బాగానే ఉంటారు కానీ… మిగిలిన ప్రాంతాల వారు వట్టి చేతులతో వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలా కాకుండా అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు ఇలా వికేంద్రీకరిస్తే ఒకరి మీద మరొకరి అధిపత్యం చెలాయించే అవకాశమే ఉండదు.

Tags:    
Advertisement

Similar News