నేరస్తుడికి గన్‌మెన్లా?... టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్‌

అనంతపురం జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తనకు గన్‌మెన్లను కేటాయించాలన్న విజ్ఞప్తిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2009లో కందికుంట ప్రసాద్‌ టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత ఓడిపోయారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2+2 గన్‌మెన్లకు కేటాయించారు. కొత్త ప్రభుత్వం అతడికి భద్రతా పరమైన ఇబ్బందులు లేవన్న ఉద్దేశంతో గన్‌మెన్లకు తొలగించింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రసాద్ హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కందికుంట ప్రసాద్ చరిత్రను పరిశీలించిన కోర్టు […]

Advertisement
Update:2019-08-25 02:33 IST

అనంతపురం జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తనకు గన్‌మెన్లను కేటాయించాలన్న విజ్ఞప్తిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2009లో కందికుంట ప్రసాద్‌ టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత ఓడిపోయారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2+2 గన్‌మెన్లకు కేటాయించారు.

కొత్త ప్రభుత్వం అతడికి భద్రతా పరమైన ఇబ్బందులు లేవన్న ఉద్దేశంతో గన్‌మెన్లకు తొలగించింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రసాద్ హైకోర్టుకు వెళ్లారు.

ఈ నేపథ్యంలో కందికుంట ప్రసాద్ చరిత్రను పరిశీలించిన కోర్టు అతడిపై 22 కేసులు ఉన్నట్టు గుర్తించింది. అదే సమయంలో నకిలీ డీడీల కేసులో అతడికి ఇప్పటికే జైలు శిక్ష కూడా పడినట్టు కోర్టు గుర్తించింది.

ఈ నేపథ్యంలో నేరాలు చేసి, శిక్ష కూడా పడ్డ వారికి గన్‌మెన్లను ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. నేరస్తుడైన కందికుంట ప్రసాద్‌కు గన్‌మెన్లను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించింది. తనకు గన్‌మెన్లను తొలగించిన నేపథ్యంలో… మరి ఫిరాయింపు ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌ బాషాకు గన్‌మెన్లను ఎలా కొనసాగిస్తున్నారని కందికుంట వర్గం ప్రశ్నిస్తోంది.

Tags:    
Advertisement

Similar News