'రాబిన్‌హుడ్‌'లో డేవిడ్‌ వార్నర్‌ లుక్‌ అదుర్స్‌

ప్రచారంలో భాగంగా ఈ సినిమాలోని వార్నర్‌ లుక్‌ను రిలీజ్‌ చేసిన మూవీ టీమ్‌;

Advertisement
Update:2025-03-15 13:18 IST

వెంకీ కుడుముల డైరెక్షన్‌లో నితిన్‌ హీరోగా నటించిన మూవీ 'రాబిన్‌హుడ్‌'. శ్రీలీల హీరోయిన్‌. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అతిథి పాత్రలో కనిపించనున్న విషయం విదితమే. ప్రచారంలో భాగంగా మూవీ టీమ్‌ ఈ సినిమాలోని వార్నర్‌ లుక్‌ను రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం ఆ లుక్‌ అటు క్రికెట్‌ అభిమానులను, ఇటు సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నది.

వార్నర్‌ ఫొటో షేర్‌ చేసిన టీమ్‌ అతడికి ఇండస్ట్రీలోకి స్వాగతం పలికింది. 'ఫ్రమ్‌ బౌండరీ టు బాక్సాఫీస్‌' అంటూ వార్నర్‌ కు వెల్‌కమ్‌ చెప్పింది. ఇక ఈ సినిమా ప్రచారంలోనూ వార్నర్‌ పాల్గొంటారని ఇటీవల వెంకీ కుడుముల వెల్లడించారు. పలువురు తెలుగు సినిమా హీరోల స్టైల్‌ను అనుకరిస్తూ డేవిడ్‌ వార్నర్‌ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. 'బాహుబలి', 'పుష్ప', 'డీజే టిల్లు' లాంటి ఫేమస్‌ క్యారెక్టర్లలో ఆయన ఫన్నీ వీడియోలు చేసి సినీ ప్రియులకు కూడా చేరువయ్యారు. ఇప్పుడు 'రాబిన్‌ హుడ్‌'తో తెరపై సందడి చేయనున్నారు. 'భీష్మ' తర్వాత నితిన్‌-వెంకి కాంబోలో తెరకెక్కిన మూవీనే 'రాబిన్‌హుడ్‌'. సినిమా రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో టీమ్‌ ప్రచారం జోరు పెంచింది. అన్ని ప్రముఖ నగరాల్లోనూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నది. 

Tags:    
Advertisement

Similar News