జగన్ రాక... అమెరికా పర్యటన విజయవంతం
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని శనివారం ఉదయం రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వై.యస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అమెరికా పర్యటించడం ఇదే తొలిసారి. గత ముఖ్యమంత్రుల్లా కాకుండా తన సొంత ఖర్చులతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లడం విశేషం. ఆయనతో పాటు ఈ పర్యటనలో కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమెరికాలో స్థిరపడిన తెలుగు […]
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని శనివారం ఉదయం రాష్ట్రానికి తిరిగి వచ్చారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వై.యస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అమెరికా పర్యటించడం ఇదే తొలిసారి. గత ముఖ్యమంత్రుల్లా కాకుండా తన సొంత ఖర్చులతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లడం విశేషం. ఆయనతో పాటు ఈ పర్యటనలో కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమెరికాలో స్థిరపడిన తెలుగు వారు ఘన స్వాగతం పలికారు.
అమెరికాలో వారం రోజుల పాటు పర్యటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డల్లాస్ తో సహా పలు నగరాలలో ఏర్పాటు చేసిన సమావేశాలలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని, పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాలు, ఇతర కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తే వాటికి ఆ దాతల పేర్లు పెడతామంటూ సరికొత్త పథకానికి నాంది పలికారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
అమెరికాలో స్థిరపడిన 60 మంది దిగ్గజ వ్యాపారవేత్తలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఇందుకోసం ఒక పోర్టల్ ఏర్పాటు చేస్తున్నామని ఆ సమావేశంలో ప్రకటించారు.
అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సాధార స్వాగతం లభించడం విశేషం. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకడుగు వేసిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపించడం మరో విశేషం.
శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జగన్మోహన్ రెడ్డికి పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. స్వాగత కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.