శ్రీరామచంద్రమూర్తిని అక్కడికి తెచ్చింది ఎవరు?
శ్రీశైలం ఈవో శ్రీరామచంద్రమూర్తిపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన్ను ఆ పోస్టు నుంచి తప్పించింది. ఆలయ దుకాణాల వేలం పాటలో ముస్లింలకు కేటాయించారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఆలయం వద్ద ఇతర మతస్తులకు అక్రమ మార్గంలో దుకాణాలు కేటాయించేందుకు శ్రీరామచంద్రమూర్తి చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా హిందూ సంస్థలు ఆందోళనకు పిలుపునివ్వడంతో విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. తక్షణం శ్రీరామచంద్రమూర్తిపై వేటు వేశారు. శ్రీశైలం ఈవోగా రాకముందే ఈయనపై అనేక విమర్శలు ఉన్నాయి. అయినా సరే 2018 జూన్ […]
శ్రీశైలం ఈవో శ్రీరామచంద్రమూర్తిపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన్ను ఆ పోస్టు నుంచి తప్పించింది. ఆలయ దుకాణాల వేలం పాటలో ముస్లింలకు కేటాయించారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఆలయం వద్ద ఇతర మతస్తులకు అక్రమ మార్గంలో దుకాణాలు కేటాయించేందుకు శ్రీరామచంద్రమూర్తి చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా హిందూ సంస్థలు ఆందోళనకు పిలుపునివ్వడంతో విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. తక్షణం శ్రీరామచంద్రమూర్తిపై వేటు వేశారు.
శ్రీశైలం ఈవోగా రాకముందే ఈయనపై అనేక విమర్శలు ఉన్నాయి. అయినా సరే 2018 జూన్ 16న చంద్రబాబునాయుడి ప్రభుత్వం ఈయన్ను ఈవోగా తెచ్చింది. అప్పటి నుంచి ఆయనపై అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కానీ నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు.
తాజాగా హిందుత్వవాదులు కొత్త అంశాన్ని కూడా బయటకు తీశారు. శ్రీరామచంద్రమూర్తి రెండు పెళ్లిళ్లు చేసుకున్నారని.. అందుకు వీలుగా ఆయన ఇస్లాం స్వీకరించారని ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పత్రిక కథనాలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
ఇంత తెలిసి కూడా చంద్రబాబు ప్రభుత్వం శ్రీశైలం ఈవోగా శ్రీరామచంద్రమూర్తిని ఎలా నియమించిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇస్లాంలోకి మారాడు కాబట్టే ఆయన శ్రీశైలం వద్ద దుకాణాలను ఆ మతం వారికి అప్పగించేందుకు ప్రయత్నించారని హిందుత్వవాదులు ఆరోపిస్తున్నారు. వివాదం తెరపైకి రాగానే తక్షణం శ్రీరామచంద్రమూర్తిపై ప్రభుత్వం వేటు వేయడాన్ని పలువురు స్వాగతిస్తున్నారు.