అమ్మో జూలై... అత్యంత వేడి మాసం
జూలై నెల. అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఎందులో అనుకుంటున్నారా..? ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ నెలా సాధించని అరుదైన రికార్డు అది. ఇలాంటి రికార్డు కూడా ఉంటుందని ముక్కున వేలేసుకుంటున్నారా.!? ఇంతకీ అదేం రికార్డ్ అనుకుంటున్నారా..? ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు అత్యంత వేడి నమోదైన నెలగా జూలై నెల రికార్డు నెలకొల్పింది. ఈ సంవత్సరం జూలై నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని, ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేడి నమోదైన నెల […]
జూలై నెల. అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఎందులో అనుకుంటున్నారా..? ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ నెలా సాధించని అరుదైన రికార్డు అది. ఇలాంటి రికార్డు కూడా ఉంటుందని ముక్కున వేలేసుకుంటున్నారా.!? ఇంతకీ అదేం రికార్డ్ అనుకుంటున్నారా..? ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు అత్యంత వేడి నమోదైన నెలగా జూలై నెల రికార్డు నెలకొల్పింది.
ఈ సంవత్సరం జూలై నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని, ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేడి నమోదైన నెల జూలై మాత్రమేనని అమెరికాలోని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇప్పటికే ఈ విషయాన్ని యూరోపియన్ యూనియన్ ప్రకటించగా తాజాగా అమెరికాలోని జాతీయ వాతావరణ, సముద్ర పరిశీలన సంస్థ నిర్ధారించింది. “జూలై నెలలో ఉన్న వేడి కారణంగా సముద్ర గర్భంలో ఉన్న మంచు కూడా కరిగిపోయింది” అని ఎన్ వోఏఏ సంస్థ పేర్కొంది.
20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 15.8 సెల్సియస్ గా నమోదు కాగా ఈ ఏడాది జూలై మాసంలో 16.75 సెల్సియస్ గా ఉష్ణోగ్రత నమోదైంది. అంటే ప్రతీ ఏటా దాదాపుగా ఉండే ఉష్ణ్రోగత్రల కంటే ఎక్కువగా జూలై నెలలో ఉష్ణోగ్రతలు పెరిగాయని అంటున్నారు.
సముద్రగర్భంలో ప్రతి ఏటా జూలై మాసంలో ఉండే మంచు కంటే ఈ సంవత్సరం జూలై నెలలో 19.8 శాతం తక్కువ మంచు ఉన్నట్లుగా అమెరికాలోని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ప్రతి ఏటా జూలై లో ఉండే మంచు కంటే 4.3 శాతం తక్కువని అధికారులు చెబుతున్నారు. 2005 సంవత్సరం తర్వాత ఉష్ణోగ్రతలు ప్రతియేటా పెరగడం గమనార్హం. దీనికి కారణం పర్యావరణాన్ని పరిరక్షించకపోవడం, అడవుల నరికివేత, నానాటికి పెరిగిపోతున్న వాహన కాలుష్యమేనని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.