డోప్ టెస్ట్ లో యువక్రికెటర్ విఫలం

పృథ్వీ షాపై 8 మాసాల సస్పెన్షన్ భారత యువఓపెనర్ పృథ్వీ షాపై బీసీసీఐ 8 మాసాల నిషేధం విధించింది. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ ఎనిమిది నెలలపాటు పాల్గొనరాదని ఆదేశించింది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 టోర్నీలో పాల్గొన్న సమయంలో నిర్వహించిన డోప్ టెస్టులో పృథ్వీ షా విఫలమయ్యాడు. నిషేధిత ఉత్ప్ర్రేరకాలను పృథ్వీ షా వాడినట్లుగా పరీక్షల్లో తేలింది. మార్చి 16 నుంచి నవంబర్ 15 వరకూ పృథ్వీ షాపై నిషేధం ఉంటుందని ప్రకటించింది. డోప్ టెస్టులకు పృథ్వీ షా […]

Advertisement
Update:2019-07-31 05:33 IST
  • పృథ్వీ షాపై 8 మాసాల సస్పెన్షన్

భారత యువఓపెనర్ పృథ్వీ షాపై బీసీసీఐ 8 మాసాల నిషేధం విధించింది. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ ఎనిమిది నెలలపాటు పాల్గొనరాదని ఆదేశించింది.

సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 టోర్నీలో పాల్గొన్న సమయంలో నిర్వహించిన డోప్ టెస్టులో పృథ్వీ షా విఫలమయ్యాడు. నిషేధిత
ఉత్ప్ర్రేరకాలను పృథ్వీ షా వాడినట్లుగా పరీక్షల్లో తేలింది.

మార్చి 16 నుంచి నవంబర్ 15 వరకూ పృథ్వీ షాపై నిషేధం ఉంటుందని ప్రకటించింది. డోప్ టెస్టులకు పృథ్వీ షా ఇచ్చిన మూత్రం శాంపిల్ లో ..టెర్బ్యూటాలైన్ అనే డ్రగ్ ఉన్నట్లు తేలింది. దగ్గు నివారణకు వాడే సిరప్ లలో ఈ డ్రగ్ ను ఎక్కువగా వాడుతూ ఉంటారు.

19 ఏళ్ల పృథ్వీ షాకు తన కెరియర్ లో ఆడిన 2 టెస్టుల్లో 237 పరుగులు సాధించిన రికార్డు ఉంది.

ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న తనకు డాక్టర్ టెర్బ్యూటెలైన్ డ్రగ్ వాడమని సలహా ఇచ్చారని…డాక్టర్ సలహామేరకే తాను.. డ్రగ్ ను వాడినట్లుగా పృథ్వీ షా వివరణ ఇచ్చినా… 8 మాసాల నిషేధం మాత్రం తప్పలేదు.

Tags:    
Advertisement

Similar News