పవన్‌ను ఏ కార్యకర్తా ప్రశ్నించవద్దు

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను పార్టీలోని నేతలు, కార్యకర్తలు ఎవరూ కూడా ప్రశ్నించవద్దని నాగబాబు సూచించారు. పార్టీ కార్యక్రమంలో ప్రసంగించిన నాగబాబు… నరసాపురంలో ఓటమికి తానేమీ బాధపడడం లేదన్నారు. పవన్ కల్యాణ్‌ ఆదేశిస్తే పార్టీ ఆఫీస్‌లో టీ పోసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అధినేత చెప్పిన దానికి ఎదురుచెప్పకుండా కార్యకర్తలు ఫాలో అయినప్పుడే అది గొప్ప పార్టీ అవుతుందన్నారు. తాను పవన్ కల్యాణ్‌ వెంటే ఉంటానని.. ఆయనతో పాటు మునిగిపోవడానికి సిద్ధం … గెలవడానికీ సిద్దమని నాగబాబు […]

;

Advertisement
Update:2019-07-31 12:39 IST
పవన్‌ను ఏ కార్యకర్తా  ప్రశ్నించవద్దు
  • whatsapp icon

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను పార్టీలోని నేతలు, కార్యకర్తలు ఎవరూ కూడా ప్రశ్నించవద్దని నాగబాబు సూచించారు. పార్టీ కార్యక్రమంలో ప్రసంగించిన నాగబాబు… నరసాపురంలో ఓటమికి తానేమీ బాధపడడం లేదన్నారు. పవన్ కల్యాణ్‌ ఆదేశిస్తే పార్టీ ఆఫీస్‌లో టీ పోసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

అధినేత చెప్పిన దానికి ఎదురుచెప్పకుండా కార్యకర్తలు ఫాలో అయినప్పుడే అది గొప్ప పార్టీ అవుతుందన్నారు. తాను పవన్ కల్యాణ్‌ వెంటే ఉంటానని.. ఆయనతో పాటు మునిగిపోవడానికి సిద్ధం … గెలవడానికీ సిద్దమని నాగబాబు చెప్పారు.

పార్టీలో ఇలా చేయండి.. ఈ పని చేయండని తాను పవన్‌కు చెప్పనని.. ఏం పని చేయాలో మాత్రమే అడుగుతానన్నారు. పవన్ కల్యాణ్ నిర్ణయాలను తాను ప్రశ్నించనని నాగబాబు వ్యాఖ్యానించారు. నిజమైన కార్యకర్తలు కూడా ఎప్పుడూ పార్టీ అధినేతను ప్రశ్నించకూడదని సూచించారు. లీడర్‌ను గుడ్డిగా అనుసరించాల్సిందేనన్నారు.

పవన్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం నచ్చకపోవచ్చని.. కానీ ఆ నిర్ణయం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనం పవన్‌కు మాత్రమే తెలుస్తుందని.. అందువల్ల కార్యకర్తలు పవన్‌ను ప్రశ్నించవద్దని నాగబాబు పిలుపునిచ్చారు.

ప్రశ్నించడానికే పుట్టిన పవన్ పార్టీలో…. ఎవరూ ప్రశ్నించవద్దని నాగబాబు చెప్పడంతో కార్యకర్తలు ఆశ్చర్య పోతున్నారు.

Tags:    
Advertisement

Similar News