బీజేపీ వైపు పవన్ చూపు ?

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ఆసక్తకిరమైన వ్యాఖ్యలు చేశారు. కొన్ని జాతీయ పార్టీలు తమతో కలిసి రావాల్సిందిగా తనను కోరుతున్నాయని వెల్లడించారు. అయితే అలా కలిసి వెళ్లినా లౌకిక పంథాను మాత్రం వీడబోనని చెప్పారు. విలువలు కాపాడడం కోసం ఏర్పాటైన జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేసే ఆలోచన లేదన్నారు. గత ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లే వచ్చినా తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. బలమైన ప్రత్యర్థులతో పోరాడాల్సి రావడం, డబ్బు, మీడియా చేతిలో లేకపోవడంతోనే జనసేన […]

Advertisement
Update:2019-07-30 05:24 IST

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ఆసక్తకిరమైన వ్యాఖ్యలు చేశారు. కొన్ని జాతీయ పార్టీలు తమతో కలిసి రావాల్సిందిగా తనను కోరుతున్నాయని వెల్లడించారు. అయితే అలా కలిసి వెళ్లినా లౌకిక పంథాను మాత్రం వీడబోనని చెప్పారు. విలువలు కాపాడడం కోసం ఏర్పాటైన జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేసే ఆలోచన లేదన్నారు. గత ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లే వచ్చినా తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. బలమైన ప్రత్యర్థులతో పోరాడాల్సి రావడం, డబ్బు, మీడియా చేతిలో లేకపోవడంతోనే జనసేన ఓడిపోయిందన్నారు.

జాతీయ పార్టీలు కలిసి రమ్మంటున్నాయి… కానీ లౌకిక పంథాను వీడేది లేదు అని పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా ఉన్నాయి. జాతీయ పార్టీలతో కలిసినా ”లౌకిక పంథా” వీడను అన్న పదాన్ని పవన్ వాడడం ద్వారా ఆ జాతీయ పార్టీ బీజేపీయే అయి ఉంటుందని స్పష్టమవుతోంది.

ఇటీవల టీడీపీ అనుబంధ సంస్థ తానా సభలకు వెళ్లిన పవన్ కల్యాణ్ అక్కడ బీజేపీ నేత రాంమాధవ్‌తోనూ సమావేశం అయ్యారు. దీన్ని బట్టి పవన్ కల్యాణ్ తిరిగి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న భావన వ్యక్తమవుతోంది.2014లోనూ మోడీని పవన్ కల్యాణ్ బలపరిచారు.

Tags:    
Advertisement

Similar News