ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్
కౌశిక్ హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుండగా అదుపులోకి తీసుకున్న 35 కరీంనగర్ పోలీసులు
హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో 10 టీవీ న్యూస్ ఛానల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తుండగా 35 మంది పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తీసుకెళ్లనున్నారు.
కరీంనగర్ కలెక్టరేట్‌లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. ఈ క్రమంలోనే అధికార సమీక్షా సమావేశంలోకి వచ్చి కౌశిక్‌రెడ్డిని పోలీసులు బైటికి గుంజుకుని వెళ్లారు. . జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పట్ల కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారని ఆయన పీఏ ఫిర్యాదు చేశారు. సమావేశాన్ని గందరగోళ పరిచి పక్కదారి పట్టించారని కరీంనగర్ ఆర్డీవో ఫిర్యాదు చేశారు. తన పట్ల ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం కంప్లైంట్ చేశారు. ముగ్గురి ఫిర్యాదుల ఆధారంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారు.