పరేడ్ మైదానంలో ప్రారంభమైన కైట్, స్వీట్ ఫెస్టివల్
ప్రారంభించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నేటి నుంచి మూడు రోజులపాటు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనున్నది. సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో కైట్ ,స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్టివల్‌ను పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లు ప్రారంభించారు.ఈ ఫెస్టివల్ లో 50 దేశాలకు దేశాలకు చెందిన 150 మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లయర్స్ పాల్గొన్నారు. దేశ విదేశాల నుంచి 1350 రకాల వివిధ పిండి వంటకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. అక్కడ చేనేత స్టాల్స్ ఆకట్టుకుంటున్నాయి. వివిధ కళారూపాలతో కళాకారుల ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పేరిణి, శివతాండవం, భరతనాట్యం, కూచిపూడి, డప్పు డోలు వాయిద్యాలతో ఆదివాసీ నృత్యాలు అలరిస్తున్నాయి.ఈ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ స్మిత సబర్వాల్, రోడ్లు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రంగారెడ్డి, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సుధీర్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి వెన్నెల గద్దర్,తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు హాజరయ్యారు.