ఢీకొన్న రెండు ఆర్టీసీ బస్సులు.. 30 మందికి స్వల్ప గాయాలు

ఈ ఘటనలో రెండు బస్సుల్లోని దాదాపు 30 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు

Advertisement
Update:2025-01-13 21:26 IST

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమదారి మొదటి మలుపులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు బస్సుల్లోని సుమారు 30 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మదనపల్లి నుంచి తిరుపతికి వస్తున్న మదనపల్లి ఎక్స్‌ప్రెస్‌.. తిరుపతి నుంచి పీలేరుకు వెళ్తున్న బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మదనపల్లి ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కోగా.. అతి కష్టం మీద అతన్ని బైటకి తీశారు. చంద్రగిరి పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను 108 లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. చంద్రగిరి పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సులను తొలిగించి రాకపోకలను క్రమబద్ధీకరించారు. 

Tags:    
Advertisement

Similar News