దావోస్ పర్యటనపై సీఎం సమీక్ష
తొలి ఏడాదిలో వచ్చిన పెట్టుబడులు, పురోగతి, ఇతర అంశాలపై చర్చించిన సీఎం రేవంత్‌రెడ్డి
దావోస్ పర్యటన నేపథ్యంలో పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అధికారులతో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. తొలి ఏడాదిలో వచ్చిన పెట్టుబడులు, పురోగతి, ఇతర అంశాలపై చర్చించారు.మొదటి ఏడాదిలో వచ్చిన పెట్టుబడులపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పత్రికా ప్రకటన ప్రకారం.. దావోస్‌లో 2024 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ సందర్భంగా చేసిన ఒప్పందాల ఫలితంగా ₹40,232 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి.14 ప్రధాన కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నాయి.18 ప్రాజెక్టులు ఖరారు చేయబడ్డాయి, 17 ప్రాజెక్ట్‌లు ఇప్పటికే పనిచేస్తున్నాయి.ఇందులో 10 ప్రాజెక్టులు శరవేగంగా సాగుతున్నాయని, 7 ప్రారంభ దశలో ఉన్నాయని అధికారులు నివేదించారు.జనవరి 16 నుంచి 19 వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు దావోస్‌లో సీఎం పర్యటించనున్నారు. సింగపూర్‌లోని స్కిల్ యూనివర్శిటీతో ఒప్పందాలను ఖరారు చేయనున్నారు. అదనపు పెట్టుబడులను అన్వేషించనున్నారు. దావోస్‌లో, ప్రతినిధి బృందం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటుంది.