జపాన్‌లో భూకంపం .. సునామీ హెచ్చరికలు జారీ

దేశ నైరుతి ప్రాంతంలో 6.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్లు తెలిపిన దేశ వాతావరణ ఏజెన్సీ

Advertisement
Update:2025-01-13 20:00 IST

జపాన్‌లో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల సమయంలో దేశ నైరుతి ప్రాంతంలో 6.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్లు దేశ వాతావరణ ఏజెన్సీ తెలిపింది. క్యుషు ద్వీపంలోని మియాజాకి ప్రాంతంలో 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో మియాజాకితోపాటు కోచీ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.

గత ఏడాది ఆగస్టులోనూ జపాన్‌లో రెండు భారీ భూంకపాలు సంభవించాయి. 6.9, 7.1 తీవ్రతతో ఏర్పడిన రెండు శక్తిమంతమైన భూకంపాలు నైరుతి దీవులైన క్యుషు, షికోకులను కుదిపేశాయి. అనేక ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే.. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గత ఏడాది జనవరి 1న సుజు, వాజిమా పరిసర ప్రాంతాల్లో 7.6 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో 300 మందికి పైగా మృతి చెందిన విషయం విదితమే.

Tags:    
Advertisement

Similar News