జడ్‌-మోడ్‌ సొరంగాన్ని ప్రారంభించిన ప్రధాని

ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్‌లోనైనా లద్దాఖ్‌ రహదారి మార్గం ద్వారా చేరుకొనే వీలు

Advertisement
Update:2025-01-13 21:17 IST

జమ్ముకశ్మీర్‌లో జడ్‌-మోడ్‌ సొరంగాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. అనంతరం టన్నెల్‌ లోపలికి వెళ్లి పరిశీలించారు. గాందర్‌బల్‌ జిల్లాలో శ్రీనగర్‌-లేహ్‌ నేషనల్‌ హైవేపై రూ. 2,700 కోట్లతో దీన్ని నిర్మించారు. కొండ చరియలు, మంచు కారణంగా రాకపోకలకు సమస్యగా మారింది. దీంతో ఇక్కడ టన్నెల్‌ ప్రాజెక్టు చేపట్టారు. ఇది సముద్ర మట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఉన్నది. 6.5 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్‌లోనైనా లద్దాఖ్‌ రహదారి మార్గం ద్వారా చేరుకోవడానికి వీలుగా దీని నిర్మాణాన్ని చేపట్టారు. 2015లో ప్రారంభమైన ఈ టన్నెలు పనులు గత ఏడాది పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    
Advertisement

Similar News